71. గుణాల పరస్పర ప్రభావం

“ వాస్తవముగా కర్మలన్నియును అన్నివిధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు (అహంకారముచే మోహితమైన అంతః కరణముగల అజ్ఞాని) “ ఈ కర్మలకు నేనే కర్తను ' అని భావించును. కానీ , గుణ విభాగ తత్త్వమును , కర్మవిభాగ తత్త్వమును తెలిసికొన్న జ్ఞానయోగి గుణములే గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటియందు ఆసక్తుడు కాడు ” అని కృష్ణ భగవానుడు విశదీకరించారు ( 3.27, 3.28). భగవద్గీత యొక్క మూలోపదేశం ఏమిటంటే ఏ కర్మలకు మనం కర్త కాదు. మనలోని , ఇతరులలోని గుణాల మధ్య పరస్పర ప్రభావం వలన కర్మలు జరుగుతాయి. సత్వ , తమో , రజో అనే మూడు గుణాలు మనలోని ప్రతి ఒక్కరిలోనూ వేర్వేరు మోతాదుల్లో ఉంటాయి. సత్వగుణం జ్ఞానానికి అనుబంధం , రజోగుణం అనేది కర్మతో అనుబంధం ; తమస్సు అజ్ఞానానికి , సోమరితనానికి దారి తీస్తుంది. ఏ గుణమూ ఇంకొక గుణము కంటే గొప్పది లేదా తక్కువ కాదు అని గమనించాలి. అవి కేవలం గుణాలు. ఉదాహరణకు , ఒక వ్యక్తిలో రజోగుణం ఎక్కువగా ఉన్నట్లయితే , వారు పనుల పట్ల గాఢంగా మొగ్గు చూపుతారు ; నిద్రపోలేరు కాబట్టి నిద్రించడానికి తమస్సు గుణం అవసరం. రెండవది , ప్రస్తుత తరుణంలో మనల్ని శాసిస