5. జ్ఞాన, కర్మ, భక్తి యోగాలు

వారి వారి దృష్టికోణాలను బట్టి భగవద్గీత అనేక మందికి అనేక విధాలుగా దర్శనమిస్తుంది. ఆత్మజ్ఞానము పొందడానికి భగవద్గీత మూడు మార్గాలను ఉపదేశిస్తుంది. కర్మయోగము , సాంఖ్య యోగము , భక్తి యోగము. కర్మయోగం మనస్సు ఆధారితమైన వారికి అనువైనది. సాంఖ్యయోగం బుద్ధిపై , భక్తియోగం హృదయం పై , ఆధారపడే వారికి అనుకూలమైనవి. ఈనాటి ప్రపంచంలో అత్యధిక శాతం మనస్సు మీద ఆధారపడే వర్గానికి చెందుతారు. మనమేవో సంకెళ్ళతో కట్టబడ్డామనీ , వాటిని తెంచుకునేందుకు చాలా కష్టపడి పని చేయాలన్న నమ్మకంపై ఆధారపడి ఇది పనుల దిశగా ప్రేరేపిస్తుంది. వీరితో ఏ విధమైన సంభాషణైనా ' ఇప్పుడు నేను ఏమి చేయాలి ' అన్న అంశంతో ముగుస్తుంది. ఈ దారి మనను నిష్కామకర్మ , అంటే కోరికలు లేని , ఫలితము ఆశించని కర్మల వైపు నడిపిస్తుంది. సాంఖ్య యోగాన్ని జ్ఞాన యోగం అని కూడా అంటారు. ఇక్కడ జ్ఞానం అంటే మనం సాధారణంగా ఉపయోగించే విజ్ఞానం కాదు ; ఇది కేవలం అవగాహన లేదా తెలుసుకోగలిగే సామర్థ్యం గురించి మాత్రమే. మనమేదో చీకటిగదిలో ఉన్నామని , ఏమి చేసినా కూడా ఈ అంధకారం పోదు గనక దాన్ని పారద్రోలడానికి ఒక దీపాన్ని వెలిగించాలన్న నమ్మకమే దాని ఆరంభ