12. మనసును నియంత్రించడం

అర్జునుడు మనసును గాలితో పోలుస్తూ , సంతులనాన్ని పొందేందుకు దాన్ని ఎలా అదుపులో పెట్టాలో తెలుసుకోవాలని ఆశిస్తాడు. శ్రీకృష్ణుడు అది కష్టమైనదని చెబుతూ , వైరాగ్యాన్ని ఆచరించడం ద్వారా దాన్ని సాధించగలమని బోధిస్తారు. జ్ఞాపకశక్తిని ఉపయోగించి , ఇంద్రియాలు అందించే సమాచారాన్ని సురక్షితమైనదిగా , సురక్షితం కానిదిగా నిర్ధారించేలా మనస్సుకు శిక్షణ ఇవ్వబడింది. పరిణామక్రమంలో ఈ సామర్ధ్యమే మనం జీవించడానికి , అభివృద్ధి చెందడానికీ ఉపయోగపడింది. మనసుకున్న ఇదే సామర్థ్యాన్ని అంతరాత్మను చేరడానికి కూడా ఉపయోగించవచ్చు. దీనినే జాగరూకత అని కూడా అంటారు. మనం ఈ సామర్ధ్యం ద్వారా సొంత ఆలోచనలు , భావనలను తిరిగి మనస్సుకు అందించి దాని నిర్ణయాల యొక్క నాణ్యతను మెరుగు పరుచుకోవచ్చు. నేటి ఆధునిక యుగంలో ఎలక్ట్రానిక్ వ్యవస్థలను స్థిరీకరించ డానికి మెషీన్ లెర్నింగ్ (యాంత్రిక అభ్యాసాన్ని) ను , కంప్యూటర్ల పనితీరును మెరుగు పరిచేందుకు ఈ విధంగానే ' ఫీడ్ బ్యాక్ లూప్స్ ' (Feedback loops) ను ఉపయోగిస్తున్నారు. ఇది సహజంగా రాదు కనక , ఆచరణ ద్వారా ఈ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని శ్రీకృష్ణుడు సూచిస్