6. శాసన నియమాలు
భగవద్గీత ఆంతరంగిక ప్రపంచంలో సమత్వాన్ని, సద్భావనను నిలబెట్టుకోవడం కోసమైతే, చట్టం
బయటి ప్రపంచంలో క్రమానుగత వ్యవస్థను నిలబెట్టడం కోసం. ఏ కర్మకైనా రెండు భాగాలు
ఉంటాయి ఒకటి ఉద్దేశం, రెండోది అమలు చేయడం. చట్టం ఆధారిత
ప్రపంచంలో, నేరపరిభాషలో లాటిన్ పదాలను ఉపయోగించి వీటిని 'మెన్స్
రియా అండ్ ఆక్టస్ రియస్' అని అంటారు.
ఉదాహరణకు
ఒక సర్జన్ మరియు హంతకుడు ఇద్దరూ పొట్టలోనికి చాకును దించుతారు. ఇక్కడ సర్జన్
ఉద్దేశం కాపాడడం/ చికిత్స చేయడం కానీ హంతకుడి ఉద్దేశం హాని చేయడం/చంపడం. రెండు పరిస్థితుల్లోనూ
మరణం సంభవించవచ్చు, కానీ ఉద్దేశాలు ఒకదానికి ఒకటి
పూర్తిగా విభిన్నమైనవి.
చట్టం
పరిస్థితులను బట్టి మారుతుంది కానీ భగవద్గీత శాశ్వతమైనది. రోడ్డుకు ఎడమ పక్కన
నడపడం ఒక దేశంలో చట్టబద్ధమైనది కానీ మరొక దేశంలో నేరంగా పరిగణించబడవచ్చు. చట్టం
పనులను మంచి పని లేదా చెడు పనిగా విభజిస్తుంది కానీ జీవితంలో అనేక సందేహాస్పదమైన
పరిస్థితులు ఉంటాయి.
మనము
పన్నులు కడుతూ ఉన్నంతవరకు (ఆక్టస్ రియస్) అది ఇష్టంతో కట్టారా కష్టంతో కట్టారా
(మెన్స్ రియా) అన్న దానితో చట్టానికి సంబంధం లేదు. ఆ ప్రాంతం యొక్క చట్టాన్ని
బట్టి, అది నిర్వచించే పరిమితులలో మనం ఉన్నంత వరకూ చట్టం మనజోలికి రాదు.
ఎవరైనా ఒక నేరం చేయాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే దానికి చట్టం అడ్డురాదు కానీ
భగవద్గీత అటువంటి ఆలోచనల్ని కూడా నిర్మూలించాలని చెబుతుంది.
మొక్కై
వంగనిది మానై వంగదు అన్నట్లు 'ఉద్దేశం' దశలో
ఉన్న కర్మను గురించి అవగాహన కలిగి ఉండాలని, లేని
యెడల మన ఆధీనము దాటిపోతుందని భగవద్గీత బోధిస్తుంది. దాన్ని అమలు చేయడం అనేది
భవిష్యత్తులో జరిగేపని కనుక దాని మీద మనకు ఎటువంటి నియంత్రణా ఉండదు.
చట్టం
యొక్క దృష్టి అమలుచేయడం మీద ఉన్నప్పటికీ, సమకాలీన నైతిక
సాహిత్యం మనం మంచి/ఉదాత్తమైన ఉద్దేశాలను కలిగి ఉండాలని ఉద్భోదిస్తుంది. ఉద్దేశాలను
అధిగమించి ఎదగడానికి భగవద్గీత మనకు సహాయం చేస్తుంది.
ఉద్దేశం
మంచిదయినా లేక చెడ్డదైనా అది విజయంతో లేక అపజయంతో కలిసినప్పుడు, అహంకారమైనా
పెంపొందుతుంది లేదా బలహీనమైన క్షణంలో లావాలా పెల్లుబికే నిరాశ, నిస్పృహ
మనసులో పేరుకుంటుంది. రెండు రకాల పరిస్థితులు మన అంతరాత్మ నుంచి మనల్ని దూరం
చేస్తాయి.
కేవలం
మన ఉద్దేశాలను గమనించడం ద్వారా మనం వాటన్నింటినీ అధిగమించి, అంతరాత్మను
చేరగలుగుతాము.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి