20. మరణం మనల్ని చంపలేదు

శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్తారు “నీవు గాని, నేను గాని ఈ రాజులు గానీ ఉండని కాలమే లేదు. ఇకముందు కూడా మనము ఉండము అన్న మాటే లేదు” (2.12). నాశనంలేని శాశ్వతమైన 'జీవన అస్తిత్వం' యొక్క 'లౌకిక భాగం' నశించడం ఖాయమని అందువల్ల ముందున్న యుద్ధాన్ని కొనసాగించవలసినదని ఆయన అన్నారు. శాశ్వతమైన 'జీవన అస్తిత్వాన్ని' ఆత్మ, చైతన్యం, అవగాహన అన్న పేర్లతో పిలుస్తాము. శ్రీకృష్ణుడు దీనినే 'దేహి' అంటారు. శ్రీకృష్ణుడు ఈ సృష్టి యొక్క సారంతో మొదలు పెట్టి శాశ్వతమైన, అపరిమితమైన 'జీవన అస్తిత్వం ' గురించి మాట్లాడతారు. ఇదే శాశ్వతమైన అస్తిత్వానికి ఒక భౌతిక భాగం ఉంది. అది తప్పని సరిగా నాశనం అవుతుందని అంటారు. శ్రీకృష్ణుడు పాలకుల గురించి మాట్లాడినప్పుడు ఆయన వారిలోని ఉన్న శాశ్వతమైన నాశనము లేని 'జీవన అస్తిత్వం' గురించి ప్రస్తావిస్తున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, మనందరమూ రెండు భాగాలతో నిర్మించబడ్డాము. మొదటి భాగము దేహము, మనస్సు - ఈ రెండూ తప్పని సరిగా నాశనమయ్యేవి. ఇవి సుఖదుఃఖాల వంటి ద్వంద్వాలకు లోనవుతాయి; అర్జునుడు అటువంటి భావనకే లోనవుతున్నాడు. రెండవ భాగము శా