25. అహంకారం వేరైనప్పుడే గమ్యం చేరుకుంటాం


శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు (2.29) - కొందరు 'దీనిని' (ఆత్మ)ని అద్భుతంగా చూస్తారు; మరికొందరు 'దీనిని' ఒక అద్భుతమని మాట్లాడతారు; మరికొందరు 'ఇది' అద్భుతమని వింటారు; అయినప్పటికీ ఇదేమిటన్నది ఎవరికీ తెలీదు.

ఎవరికీ' అనే పదం, ఆత్మ ను అర్థం చేసుకోవడానికి తన ఇంద్రియాలను ఉపయోగించే పరిశీలకుడిని సూచిస్తుంది. ఈ రెండింటికీ మధ్య ఒక విభజన ఉన్నంత వరకు ఒక పరిశీలకుడు ఆత్మను గ్రహించలేడని శ్రీకృష్ణుడు అంటారు.

ఒకసారి ఒక ఉప్పుతో చేసిన బొమ్మ సముద్రాన్ని శోధించాలని బయలుదేరింది. ఉపరితలంలోని అలలను దాటి, అది సముద్రంలోతుకి వెళ్లి, నెమ్మదిగా కరిగిపోవడం మొదలు పెడుతుంది. సముద్రగర్భాన్ని చేరుకొనే లోపల అది పూర్తిగా కరిగిపోయి సముద్రంలో భాగమై పోతుంది. అంటే అదే సముద్రంగా మారిపోయిందని ఉప్పు బొమ్మకు ఇక వేరే ఉనికి లేదని అనవచ్చు. పరిశీలకుడే (ఉప్పు బొమ్మ) పరికించేది (సముద్రం) గా మారినప్పుడు విభజనలు అంతమై ఐక్యత సాధించ బడుతుంది.
ఈ ఉప్పు బొమ్మ మన అహంకారం (అహం కర్త; నేనే కర్తని) వంటిది. ఇది మన ఆస్తులు, ఆలోచనలు, చర్యల ద్వారా ఎల్లప్పుడూ మనల్ని సత్యం నుంచి దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఎవరూ అనామకునిలా కావాలనుకోరు; సామాన్యంగా ఉండాలనుకోరు.

కానీ ఈ ప్రయాణం ఐక్యత కోసం, భగవంతునిలో లయమవ్వడం కోసం; అది జరగాలంటే ఉప్పు బొమ్మలాగా అహంకారం కరిగిపోవాలి. మనకు స్వంతమైన వస్తువులు, ఆలోచనలు అన్నింటినీ ఫణంగా పెట్టాలని దీనికి అర్ధం.
మనం నశించినప్పుడే గమ్యం అరుదెంచే ప్రయాణమిది; ఇక్కడ 'నేను', 'నాది', 'నన్ను', 'నాకు' అనేవి వాడిపడేసే పరికరాలవుతాయి గుర్తింపులు కాదు. సుఖదుఃఖ ధృవాల శిఖరాల వద్ద మనం నిరహంకారం యొక్క వీక్షణం పొందుతాము
సాక్షాత్కారం కలిగే ఇటువంటి క్షణాలలో మనకు తెలిసినది, మనం చేస్తున్నది, మనకు ఉన్నవి ముఖ్యం కాదు. 'మనమేమిటి' అన్న వీక్షణం కలుగుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

4. మనస్సు ఆడించే ఆటలు

6. శాసన నియమాలు

3. వర్తమానానిదే ప్రాధాన్యత