31. కర్మయోగంలో చిన్న ప్రయత్నాలతో పెద్ద ఫలితాలు

కర్మ యోగాన్ని ఏ మోతాదు లో సాధన చేసినా కూడా ఫలితాలను ఇస్తుందని, ఈ ధర్మం (క్రమశిక్షణ) మహా భయాల నుండి మనలను రక్షిస్తుందని శ్రీకృష్ణుడు హామీ ఇచ్చాడు (2.40). సాంఖ్య యోగం స్వచ్ఛమైన అవగాహన అయితే, కర్మ యోగంలో ప్రయత్నం చేయవలసి ఉంటుందని గమనించాలి. తమ ఆధ్యాత్మిక యాత్రను ఇప్పుడే ప్రారంభించిన వారికి, ఈ ప్రయత్నాన్ని కఠినంగా భావించే సాధకులకు ఇది శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన ఖచ్చితమైన హామీ. మన కష్టాన్ని అర్థం చేసుకున్న శ్రీకృష్ణుడు ఒక చిన్న ప్రయత్నం కూడా అద్భుతమైన ఫలితాలను ఇవ్వగలదని హామీ ఇచ్చారు. నిష్కామ కర్మ (ప్రేరణలేని చర్య) ద్వారా సమానత్వ మార్గాన్ని అనుసరించమని ఆయన మనల్ని ప్రేరేపిస్తారు. ఒక మార్గం ఏమిటంటే, శ్రీకృష్ణుడు చెప్పినదానిపై శ్రద్ధ కలిగి ఉండడం; కర్మ యోగంపై ఆయన బోధనను ఆచరించడం. మన అనుభవాలను కర్మ యోగమనే దృష్టితో చూడడం అభ్యసించినప్పుడు, మన అనుభూతులు మరింత లోతుకు వెళుతూ చివరకు మన అంతరంగాన్ని చేరుకుంటాయి. ప్రత్యామ్నాయ మార్గం ఏమిటంటే మన భయాలను అర్థం చేసుకోవడం; కర్మ యోగ సాధన వాటిని ఎలా తొలగించగలదో తెలుసుకోవడం. మన అంతర్గత అంచనాలకు, వాస్తవ ప్రపంచానికి పొంతన కుదరకపోవడమే భయానికి మూలం. కర్