27. స్వధర్మంతో సమన్వయం


కృష్ణుడి స్వధర్మాన్ని గురించి అర్జునుడికి వివరిస్తూ (2.312.37), ఇటువంటి అయాచిత యుద్ధం స్వర్గానికి ద్వారాలను తెరుస్తుందని (2.32), దీని నుంచి పారిపోవడం వల్ల స్వధర్మం, కీర్తి నశించి పాపం కలుగుతుందని చెబుతారు (2.33). యుద్ధ క్షేత్రంలో అర్జునుడికి ఇవ్వబడిన ఈ సలహాలు నిర్దిష్ట సందర్భాలకు పరిమితమని అర్థం చేసుకోవాలి. నిజానికి, శ్రీకృష్ణుడు ఒకరి స్వధర్మంతో సామరస్యం, సమన్వయం గురించి మాట్లాడుతున్నారు కానీ యుద్ధం గురించి కాదు.

శ్రీకృష్ణుడు అర్జునుడు యొక్క ఆలోచనలు, మాటలు, చర్యల మధ్య పొంతన లేకపోవడం గమనిస్తారు. వాటన్నిటిని సమన్వయ పరచడానికి ఆయన అర్జునుడికి దారి చూపే ప్రయత్నం చేస్తారు. అర్జునునికి అతని స్వధర్మం ప్రకారం యుద్ధం చేయడమే సమన్వయం; యుద్ధాన్ని నివారించడం వైరుధ్యం. 

చిన్న ఎలక్ట్రాన్లు', 'ప్రోటాన్లు', ' న్యూట్రాన్లు' నుంచి పెద్ద పెద్ద నక్షత్ర మండలాలు, గ్రహాలు, నక్షత్రాల వరకు అన్నీ సామరస్యంతో ఉంటాయి. అందుకే సామరస్యమే ఈ సృష్టిని పరిపాలిస్తుంది. ఒక రేడియో, రేడియో స్టేషన్ సామరస్యంతో (tune) ఉన్నప్పుడు మనం మనకు నచ్చిన సంగీతాన్ని ఆస్వాదించగలుగుతాము. సామరస్యానికి మానవ దేహాన్ని మించిన ఉదాహరణ లేదు. ఇందులో అనేక అంగాలు, రసాయనాలు సమన్వయంతో పనిచేసి మనకు జీవితాన్ని ఇస్తాయి.

ఇక్కడ సామరస్యం అంటే యధాతధంగా ఉన్న వస్తువులు, పరిస్థితులే తప్ప మనం కోరుకున్నట్లు మన అభిప్రాయాలు, విలువల ప్రకారం ఉండేవి కాదు.

మనము చేసే మంచి పనులు మరణం తర్వాత స్వర్గానికి, చెడ్డపనులు నరకానికి తీసుకు వెళ్తాయని మన బాల్యం నుంచి మనకు బోధించారు. స్వర్గం-నరకం అనేవి మరణం తర్వాత చేరుకునే ప్రదేశాలు కాదనీ ఒకరి సామర్థ్యాన్ని బట్టి, అవకాశాలు దొరకడాన్ని బట్టి, ఇక్కడే ఇప్పుడే ఉంటాయనీ శ్రీకృష్ణుడు సూచిస్తున్నారు.

ఇతరుల స్వధర్మాన్ని మనం అర్ధం చేసుకున్నప్పుడు కుటుంబాలలో, పనిచేసే చోట్లలో అనుబంధాల మధ్య సామరస్యం నెలకొంటుంది; ఇదే స్వర్గంతో సమానం అలా లేకపోతే నరకం.

మన కోరికలు తీరడం లేక తీరకపోవడాన్ని బట్టి మనం సుఖం లేక దుఃఖము యొక్క అనుభూతి చెందుతాము. స్వధర్మం తో అంతర్గత సామరస్యం సాధించాక బయటి ప్రపంచంలోని విషయాలతో సంబంధం లేకుండా జీవితం స్వర్గతుల్యంగా ఉంటుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

4. మనస్సు ఆడించే ఆటలు

6. శాసన నియమాలు

3. వర్తమానానిదే ప్రాధాన్యత