30. నీళ్లు, ఇసుక, రాతిపై వ్రాత


సాంఖ్యం (అవగాహన) (2.11-2.38) ను గురించి వివరించాక శ్రీకృష్ణుడు కర్మయోగం గురించి వివరించనారంభించారు (2.39). దీన్ని ఆచరించడం ద్వారా మనము కర్మబంధాల నుండి విముక్తి పొందవచ్చు.

సాంఖ్య యోగాన్ని గురించి వ్యాఖ్యానించేటప్పుడు శ్రీకృష్ణుడు తను ఒక నాశనము లేని చైతన్యమని విశదీకరిస్తారు. ఈ శ్లోకం తో శ్రీకృష్ణుడు కర్మ యోగం ద్వారా అదే విషయాన్ని వివరించడం మొదలుపెడతారు. కాబట్టి కర్మబంధనాలను, యోగాన్ని ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సి ఉంది.
యోగం అంటే కలయిక. దీనిని అనేక సందర్భాల్లో ఉపయోగిస్తారు. విజయం లేక అపజయంతో సంగం లేని సమభావాన్ని శ్రీకృష్ణుడు యోగం అంటారు (2.48). సుఖదుఃఖాల పట్ల, గెలుపు ఓటములపట్ల, లాభనష్టాల పట్ల, సమభావాన్ని కొనసాగించమని (2.38) శ్రీకృష్ణుడు అంతకుముందే బోధించియున్నారు. 'కర్మ బంధం', మనం చేస్తున్న కర్మల వలన గాని, అకర్మల ద్వారా గాని, మన లోపల నుండి లేక వెలుపలి నుండి వచ్చే ప్రతిస్పందనల వలన గాని మనకు కలిగే ఆనందకరమైన లేక బాధాకరమైన ముద్రలు లేక గాయపు మచ్చలని సూచిస్తుంది.

సాంకేతికంగా వీటినే నాడీ నమూనాలు లేక న్యూరాన్ల పొందిక (neural patterns) అనవచ్చు. ఈ పొందికలు అపస్మారక స్థాయి లో (మనకు తెలియకుండానే) ఉండి మన ప్రవర్తనను ప్రభావం చేసాయి. అందుకే యోగం ద్వారా కర్మ బంధాలనుండి మనల్ని మనం విడిపించు కోవాలని శ్రీకృష్ణుడు చెబుతారు.

మన సహజ స్వభావం ప్రకారం, మన అభిప్రాయంలో సుఖాన్ని లేక లాభాన్ని కలిగిస్తాయనుకునే కర్మలను చేయడానికి ఉత్సాహం చూపిస్తాము. అలాగే బాధ లేక నష్టం కలిగే పనుల పట్ల విముఖతను పెంపొందించు కుంటాము. ఈ అభిప్రాయాలు ఎంత లోతుగా ఉంటే ఆయా పనుల పట్ల అంత తీవ్రమైన సుముఖత లేక విముఖత ఉంటుంది.

ఈ అభిప్రాయాలు యొక్క బలాన్ని భౌతికంగా ఒక రాతి మీద, ఇసుక మీద, నీటి మీద వ్రాయడం తో పోల్చవచ్చు. రాతిపై ముద్రలు లోతుగా ఉండి చాలాకాలం ప్రభావితం చేస్తాయి. ఇసుక పైన ముద్రలు అంతకంటే తక్కువ కాలం ఉంటాయి. నీటిపై వ్రాసినవి వెంటనే చెరిగిపోతాయి.

కర్మ యోగం మనలను కర్మ బంధాలనుండి విముక్తులును చేస్తుందని శ్రీకృష్ణుడు అన్నప్పుడు నీటిపై వ్రాతలతో పోలుస్తున్నారు. కర్మయోగం మనల్ని ఎంత సరళంగా చేస్తుందంటే ఏ విషయమూ మనల్ని ప్రభావితం చేయలేదు; బాధ పెట్టలేదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

1. అహంకారం తో ఆరంభం

26. గులాబీ ఎన్నడూ పద్మం కాలేదు

6. శాసన నియమాలు