32. నిశ్చయాత్మకమైన బుద్ది సమత్వాన్ని తీసుకు వస్తుంది
కర్మ యోగంలో బుద్ధి నిశ్చయాత్మకంగా
ఉంటుందని అలాలేని వారి బుద్ధి బహు శాఖలుగా (అనేక భేదాలతో) ఉంటుందని శ్రీకృష్ణుడు (2.41) చెప్పారు.
శ్రీకృష్ణుడు
సమత్వమే యోగమని చెప్పారు (2.48 & 2.38). జీవితంలో మనం ఎదుర్కొనే సుఖం-దుఃఖం,
గెలుపు-ఓటమి; లాభం -నష్టం వంటి రెండు ధ్రువాల
కలయిక ఇది. కర్మ యోగం ఈ ధ్రువాలను అధిగమించే మార్గం. ఇది చివరికి నిశ్చయాత్మకమైన
బుద్దిగా మారుతుంది. మరోవైపు సంతులనం లేని బుద్ధి మన మానసిక ప్రశాంతతకు భంగం
కలిగిస్తుంది.
సుఖం, విజయం, లాభం పొందినప్పుడు మనశ్శాంతి దానికదే
కలుగుతుందని మనం అనుకుంటాము. కాని శ్రీకృష్ణుడు కర్మ యోగం ద్వారా తీసుకురాబడిన
నిశ్చయాత్మక బుద్ధి ద్వంద్వాలను అధిగమించేందుకు సహాయపడి మనకు మనశ్శాంతినిస్తుందని
అంటారు.
అస్థిరమైన
బుద్ధి వివిధ పరిస్థితులను, ఫలితాలను, వ్యక్తులను భిన్నంగా
చూస్తుంది. మన కార్యాలయంలో మనము మన క్రింది ఉద్యోగులకు ఒక కొలమానాన్ని, మన పై అధికారులకి మరొక కొలమానాన్ని వర్తింపజేస్తాము. కుటుంబాల్లో
విభిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటూ వివిధ ప్రమాణాలను వర్తింప చేస్తాము. మనకు
ఇష్టమైన వారి కోసం ఒక నియమం ఇతరుల కోసం మరొక నియమం పాటించడం చూడడం వలన పిల్లలలో 'సమత్వం' అభివృద్ధి చెందడం కష్టమవుతుంది.
మన
దైనందిన జీవితంలో మనం మతం, కులం, జాతీయత, మూఢనమ్మకాల వంటి అభూత కల్పనలకు బాధితులం. ఎదిగే దశలో ఇవన్నీ మన మనస్సులో
ముద్రించబడి, మనల్ని విభజిస్తూ ఉంటాయి. ఈ అభూత కల్పనలు,
విభజనలు మనల్ని అన్ని వైపుల నుండి ప్రభావితం చేస్తాయి.
అస్థిరమైన
బుద్ధిలో మన తప్పులను నిర్ధారించడానికి మనకు ఒక కొలమానం ఇతరులను నిర్ధారించడానికి
మరొక కొలమానం ఉంటుంది. సహాయం కోరుతున్నప్పుడు, సహాయం
అందిస్తున్నప్పుడు మేము వేర్వేరు రంగులు చూపిస్తాము.
కర్మ
యోగ మార్గాన్ని అనుసరించడం ద్వారా నిశ్చయాత్మకమైన బుద్ధి కలిగి మనశ్శాంతికి పునాది
అయిన 'సమత్వాన్ని తీసుకురాగల యోగ్యతను పొందుతారని
శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి