34. కర్మ పై దృష్టి కర్మఫలంపై కాదు.

 


మనకు కర్మ చేసే అధికారం ఉంది కానీ కర్మఫలం పై అధికారం లేదని”, భగవద్గీతలోని ప్రతిష్టాత్మకమైన శ్లోకం 2.47 ద్వారా శ్రీకృష్ణుడు చెప్పారు. మన కర్మలకు కర్మఫలం ప్రేరణగా ఉండకూడదని, అదే సమయంలో మనం అకర్మ వైపు మొగ్గకూడదని కూడా ఆయన చెప్పారు. జీవితంలోని వివిధ కోణాలను ఈ శ్లోకములో చూస్తాము కనుక ఇది భగవద్గీతలో ఎక్కువగా ప్రస్తావించబడే శ్లోకం.

      శ్రీకృష్ణుడు శ్రద్ధ అద్భుతాలు చేయగలదని హామీ ఇస్తారు (7.21-7.22). ఈ శ్లోకాన్ని సంగ్రహించడానికి శ్రీకృష్ణుడి మీదే శ్రద్ధ పెట్టి దాని తర్కంలోకి లోతుగా వెళ్లకుండా, దాని వివిధ కోణాలను విశ్లేషించడానికి ప్రయత్నించకుండా; దానిని అమలు చేయడం ప్రారంభించడమే సులభమైన విధానం. ఈ శ్లోకంలోని శబ్దాల అర్ధాన్ని ఆచరణలోకి తీసుకురావడం ద్వారా కర్మ యోగం యొక్క పరాకాష్టకు మనము చేరుకొనగలము.

      మన కర్మల యొక్క కర్మఫలంపై దృష్టి కేంద్రీకరించడం వలన మనం కర్మమీద ధ్యాస/ధ్యానం కోల్పోయేలా చేస్తుంది; దాని ఫలితంగా కర్మఫలమే తిరస్కరించబడుతుంది. విద్యార్థి చేత పేలవంగా అమలు చేయబడిన కర్మ (అధ్యయనం) ఎప్పటికీ కోరుకున్న కర్మఫలం (పరీక్ష ఫలితాలు) ఇవ్వదు. మనకు ఎదురయ్యే ఏ పరిస్థితిలోనైనా మన వంతు కృషి చేయడంపై మాత్రమే దృష్టి పెట్టాలని శ్రీకృష్ణుడు నొక్కి చెప్పాడు.

      మూడవది, కర్మ ప్రస్తుత క్షణంలో జరుగుతుంది కానీ కర్మఫలం ఎల్లప్పుడూ భవిష్యత్తులో ఉంటుంది. కర్మఫలం అనేది అనేక సంభావనల కలయిక. మనకు వర్తమానంపై మాత్రమే నియంత్రణ ఉంటుంది కానీ భవిష్యత్తు లేదా గతంపై నియంత్రణ ఉండదు కాబట్టి ఎల్లప్పుడూ ప్రస్తుత క్షణంలో కర్మపై ధ్యానంతో ఉండాలని శ్రీకృష్ణుడు సలహా ఇస్తున్నారు.

      దృష్టికోణం లేదా అవగాహన ఏదైతేనేం నిరంతరముగా పయనించే సుఖ-దుఃఖ ధ్రువ తరంగాలను అధిగమించడంలో సహాయం చేయడం ద్వారా మనలో సమానత్వం తీసుకురాగల సామర్థ్యం ఈ శ్లోకానికి ఉంది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

1. అహంకారం తో ఆరంభం

4. మనస్సు ఆడించే ఆటలు

6. శాసన నియమాలు