36. కనిపించేది కర్మఫలం కాకపోవచ్చు
ప్రస్తుతం మనం కోరుకునే కర్మఫలాలు
మనకు మంచివో కాదో అర్థం చేసుకునేంత తెలివితేటలు మనకు సాధారణంగా ఉండవు. విఫలమైన
అనుబంధం లాగా, ఒక సమయంలో ఒక జంట కలిసి ఉండాలని కోరుకుంటారు కానీ
కొంత సమయం తర్వాత వారు విడిపోవాలనుకుంటారు. వాస్తవానికి, నేడు
సమాజం బాగా పశ్చాత్తాపపడానికి కారణం వారు గతంలో తీవ్రంగా కోరుకున్న కర్మఫలాన్ని
పొందిన తరువాత, కాలక్రమేణా అలా దక్కించుకున్న కర్మఫలం
వినాశకరమైనదిగా మారడం వల్లనే. దీనికి విరుద్ధంగా, మామూలు
అనుభవాన్ని బట్టి చూస్తే, గతంలో ఏదో ఒక సమయంలో వారు
కోరుకున్న కర్మఫలాన్ని పొందకపోవడమే తమకు జరిగిన గొప్ప మేలని చాలామంది భావిస్తారు.
కాలానుగుణంగా
పొందిన ఈ జీవిత అనుభవాలు భగవద్గీతలోని ప్రతిష్టాత్మకమైన 2.47 శ్లోకాన్ని అర్థం చేసుకోవడంలో మనకు సహాయపడతాయి. మనకు కర్మ చేసే అధికారం
ఉంది కానీ కర్మఫలంపై అధికారం లేదని శ్రీకృష్ణుడు ఈ శ్లోకం చెప్పారు.
ఈ
అనుభవాలను ఈ శ్లోకాన్ని 'ద్వంద్వ' మార్గం ద్వారా
చూడటానికి ఉపయోగించవచ్చు. ప్రపంచం ద్వంద్వమైనది; ప్రతిదీ
దాని వ్యతిరేక అవస్ధలో కూడా ఉంది. ఇదే కర్మఫలానికి కూడా వర్తిస్తుంది.
మొదటి
సందర్భంలో ఒక సంతోషం (సుఖం/విజయం /లాభం ) అనే ధ్రువం కొంత సమయం తరువాత బాధ
(దుఃఖం/ఓటమి/నష్టం) అనే ధ్రువంగా మారింది. రెండవ సందర్భంలో సరిగ్గా విరుద్ధంగా
జరిగింది.
ఈ
నిత్య ధ్రువాలను తెలుసుకోవడం ద్వారా, వాటిని అధిగమించమని
శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు. కర్మఫలం పై కోరిక అటువంటి ధ్రువాలలో ఒకటి. దాని
ఉచ్చులో పడకుండా అధిగమించాలి.
సృష్టికర్తకు
(చైతన్యం, సృజనాత్మకత) 13.5 బిలియన్
సంవత్సరాలకు పైగా ఈ విశ్వాన్ని నడిపిన అనుభవం ఉంది. అలాంటిది, మన కర్మఫలం విషయంలో ఆయన ఎలా తడబడతారు? ఖచ్చితంగా
తడబడరు. మనకు అవసరమైనది లేదా అర్హమైనది తప్పకుండా పొందుతాము.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి