37. అదే అర్జునుడు అదే బాణం

 


అదే అర్జునుడు అదే బాణం”, అన్నది ఒక సామెత. విజయవంతమైన/సమర్ధుడైన వ్యక్తి ఎప్పుడన్నా తన కర్మ క్షేత్రములో విఫలమైనప్పుడు ఆ స్థితిని వివరించడానికి తరచుగా దీన్ని ఉపయోగిస్తారు.

      యోధునిగా అర్జునుడు ఎప్పుడూ యుద్ధంలో ఓడిపోలేదు. అతని జీవితపు చరమాంకంలో కొంతమంది కుటుంబ సభ్యులను, బందిపోట్ల సమూహం నుండి రక్షించడానికి చేసిన ఒక చిన్న యుద్ధంలో ఓడిపోయాడు. ఆ స్థితిని తన సోదరుడికి వివరిస్తూ ఇలా అంటాడు, “ఏమి జరిగిందో నాకు తెలియదు. నేను అదే అర్జునుడిని, ఇవి కురుక్షేత్ర యుద్ధాన్ని గెలిచిన అవే బాణాలు, కానీ ఈసారి నా బాణాలు వాటి లక్ష్యాన్ని ఛేదించలేకపోయాయి లేదా వాటి శక్తిని కోల్పోయాయి.అప్పుడు కుటుంబాన్ని కాపాడుకోలేక పారిపోవాల్సి వచ్చిందని ఆయన శోకించాడు.

      మనలో ఎవరికైనా ఇలా జరగవచ్చునని జీవిత అనుభవాలు చెబుతున్నాయి. చాలా సార్లు ప్రతిభావంతులైన క్రీడాకారులు కొంతకాలం తమ క్రీడా సామర్థ్యాన్ని (form) కోల్పోతారు. ఒక నటుడు, గాయకుడు విఫలమవుతారు. ఇది అదృష్టం, చెడు సమయం మొదలైన వాటికి ఆపాదించబడుతుంది కానీ అసలు కారణం ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. అనుమానాలు, ఊహాగానాలు తప్ప దీనికి శాస్త్రీయ వివరణ లేదు.

      ఈ సందర్భంలో కర్మ - కర్మఫలాల మధ్య సంబంధాన్ని వివరిస్తూ శ్రీకృష్ణుడు 'దైవం' (భగవంతుని సహకారం/సంకల్పం/ ఆశీర్వాదాలు) కర్మ నెరవేర్చడానికి దోహదపడే అంశాలలో ఒకటని చెప్పారు (18.14). దైవం ఒక రకమైన విశేష అంశం; వ్యక్తీకరింపబడిన విశ్వం యొక్క దృష్టికోణం నుండి తెలియజాలదు. కర్మపై నీకు హక్కు ఉంది కానీ కర్మఫలంపై కాదు అని శ్రీకృష్ణుడు చెప్పడానికి కారణం అదే.

      హస్తసాముద్రికం, జ్యోతిష్యం, సూర్య రాశులు వంటి విద్యలను అభ్యసిస్తారు కానీ వాటిలో ఏదీ దైవం కాదు. అదేవిధంగా దైవాన్ని అంచనా వేయగల శాస్త్రీయ సిద్ధాంతమేదీ లేదు.

      సర్వశక్తిమంతుని యొక్క గొప్ప రూపకల్పనలో మనం నిమిత్త మాత్రులమని, చిన్న తునకలం అని శ్రీకృష్ణ భగవానుడు మనకు గుర్తు చేస్తారు (11.33). విజయం మనలో అహంకారాన్ని పుట్టించకపోతే వైఫల్యం మనల్ని బాధించదు. ఎందుకంటే రెండూ దైవం ద్వారానే ప్రభావితమవుతాయి.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

6. శాసన నియమాలు

42. అహంకారపు వివిధ కోణాలు.

73. సమర్పణ కళ