పోస్ట్‌లు

జనవరి, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

42. అహంకారపు వివిధ కోణాలు.

చిత్రం
  అహంకారం (నేను కర్తనే అన్న భావన) అర్జునుడిని ఆవహించిందని , అదే అతని విషాదానికి కారణమని శ్రీకృష్ణుడు గమనించారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి అహంకారాన్ని విచ్ఛిన్నం చేయడానికి , అంతరాత్మ దాకా చేరుకోడానికి సమగ్ర బుద్ధిని ఉపయోగించమని సలహా ఇస్తారు ( 2.41). ,       అహంకారానికి అనేక రూపాలున్నాయి. గర్వం అహంకారంలో ఒక చిన్న భాగం. ఎవరన్నా విజయం/గెలుపు/లాభం అనే ధ్రువాల గుండా వెళుతున్నప్పుడు ఆ అహంకారాన్ని అభిమానం అంటారు. ఎవరైనా నష్టం/వైఫల్యం/ఓటమి అనే బాధాకరమైన ధ్రువాల గుండా వెళుతున్నప్పుడు ఆ అహంకారాన్ని నిరాశ/దుఃఖం/ క్రోధం అంటారు. ఇతరులు సుఖమనే ధృవాల ద్వారా వెళుతున్నప్పుడు మనలోని అహంకారం అసూయగా మారుతుంది. ఎవరన్నా ఆ దుఃఖమనే ధ్రువణతలో ఉంటే అదే సానుభూతిగా మారుతుంది.       మనం భౌతిక ఆస్తులను కూడబెడుతున్నప్పుడు , వాటిని పోగొట్టుకున్నప్పుడు కూడా ఇది ఉంటుంది. ఇది లోకంలో కర్మ చేయడం లేక సన్యాసం స్వీకరించడానికి ప్రేరేపిస్తుంది. ఇది సృష్టితో పాటు వినాశనానికి కూడా కారణం. అది జ్ఞానంలోనూ , అజ్ఞానంలోనూ ఉంది.       ప్రశంసలు అహంకారాన్ని పెంచుతాయి ; విమర్శలు బాధ పెడతాయి. ఈ రెండు దశలూ మనల్ని ఇతరులు తారుమారు చేసేందు

41. అంతర్గత యాత్రకు సమగ్రమైన బుద్ధి

చిత్రం
  యోగం అంటే మనలోపలి , వెలుపలి భాగాల కలయిక. కర్మ , భక్తి , సాంఖ్య , బుద్ధి మొదలైన అనేక మార్గాల ద్వారా దీనిని పొందవచ్చు. తన స్వభావాన్ని బట్టి వారికి తగిన మార్గాల ద్వారా యోగాన్ని పొందుతారు.       “ ఈ సమత్వబుద్ధి యోగము కంటెను సకామకర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది. కావున , నీవు సమత్వ బుద్ధియోగమునే ఆశ్రయింపుము. ఏలనన , ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు , కృపణులు. ” అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పారు ( 2.49). అంతకుముందు , శ్రీకృష్ణుడు కర్మయోగంలో బుద్ధి పొందికగా ఉంటుందని మరియు అస్థిరమైన వారి బుద్ది నిలకడ లేకుండా ఉంటుందని చెప్పారు ( 2.41).       ఒకసారి బుద్ధి సమగ్రతను సాధిస్తే , భూతద్దం కాంతిని కేంద్రీకరించినట్లు అది జ్ఞానోపాసనలో , సమర్ధతను పొందుతుంది. ' స్వయం ' వైపు ప్రయాణంతో సహా ఏదైనా ప్రయాణం దిశ , గమనం కలిగి ఉంటుంది. ఇక్కడ కృష్ణుని ప్రస్తావన అంతరంగం వైపు ప్రయాణం యొక్కదిశ గురించి. సాధారణంగా మనం బాహ్య (భౌతిక) ప్రపంచంలో కోరికలను నెరవేర్చుకోవడానికి తెలివిని ఉపయోగిస్తాము ; అయితే మనం ' స్వయం ' వైపు మన ప్రయాణాన్ని కొనసాగించడానికి దానిని ఉపయోగించాలని భగవద్గీత బోధిస్త

40. కర్తృత్వ భావనను విడనాడడం

చిత్రం
  “ యోగ స్థితుడవై ఆసక్తిని వీడి సిద్ధి-అసిద్ధిల ఎడ సమత్వ భావము కలిగియుండి కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఈ సమత్వ భావమునే యోగ మందురు ” అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించారు ( 2.48). మరో మాటలో చెప్పాలంటే మనల్ని మనం ద్వంద్వాలతో గుర్తించుకోవడం మానేసినప్పుడు మనం ఏమి చేసినా సమంజసంగా ఉంటుంది.       మన రోజువారీ జీవితంలో అనేక నిర్ణయాలు తీసుకుంటాము ; ఎంపికలు చేస్తూ ఉంటాము. ఎప్పుడూ నిర్ణయించే మనస్సు అందుబాటులో ఉన్న అవకాశాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటుంది. శ్రీకృష్ణుడు ఈ అవకాశాలను సుఖం/దుఃఖం , లాభం/ నష్టం , గెలుపు ఓటమి మరియు విజయం /వైఫల్యంగా వర్గీకరిస్తారు ( 2.38).       ' సమత్వం ' అనేది పరస్పర విరుద్ధ ధృవాలను సమానంగా పరిగణించడం ; దీనిని సాధారణంగా ద్వంద్వాలను అధిగమించడమని పిలుస్తారు. ఈ అవగాహన లోతుగా నాటుకున్నప్పుడు మనస్సు శక్తిహీనమై , ఎంపికతో పనిలేని అవగాహనను పొందుతుంది. మనం నిద్రలో లేదా మత్తులో ఉనప్పుడు సహజంగానే ఆలోచించే సామర్థ్యాన్ని కోల్పోతాము. మనకు ఆలోచించే సామర్థ్యం ఉన్నప్పటికీ ఆలోచించకుండా ఉండగల సామర్థ్యమే సమత్వము. అంటే ప్రస్తుత క్షణంలో సజీవంగా ఉంటూ కేవలం ఒక పరిశీలకుడిగా ఉండడము

39. పునరావృతం ప్రావీణ్యానికి కీలకం

చిత్రం
  కర్ణుడు , అర్జునుడు కుంతికి జన్మించారు కానీ వ్యతిరేక పక్షాల కోసం పోరాడారు. కర్ణుడు శపించబడ్డాడు. దాని కారణంగా అర్జునుడితో కీలకమైన పోరాటంలో అతని జ్ఞానము , యుద్ధ అనుభవం అతనికి ఉపయోగపడలేదు. అతను యుద్ధంలో ఓడిపోయి , హతుడయ్యాడు.       ఈ పరిస్థితి మనందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే మనమూ తరచూ కర్ణుడిలా ఉంటాము. మన జీవితంలో మనం చాలా నేర్చుకుంటాము ; జ్ఞానాన్ని , అనుభవాన్ని పొందుతాము. కానీ కీలకమైన సమయాల్లో మనం అవగాహన కు బదులు మన ప్రవృత్తులను బట్టి ఆలోచిస్తాము , పని చేస్తాము. ఎందుకంటే మన అవగాహన అవసరమైన స్థాయి కంటే తక్కువగా ఉంటుంది.       కృష్ణుడికి దీని గురించి పూర్తిగా తెలుసు కనుకనే భగవద్గీతలోని వివిధ కోణాల నుండి వాస్తవికతను , సత్యాన్ని పదేపదే వివరిస్తారు. తద్వారా లోతైన అవగాహనలో అవసరమైనంత స్థాయికి చేరుకోవాలనే ఇలా చెబుతుంటారు.       ఒక నదికి ఉండే రెండు తీరాల్లా మనలో అంతరాత్మ , భౌతిక శరీరము అనే రెండు భాగాలున్నాయని భగవద్గీత చెబుతుంది. సాధారణంగా మనం మన భౌతిక శరీరం , మన భావోద్వేగాలు , ఆలోచనలు , మన చుట్టూ ఉన్న ప్రపంచంతో కూడిన బాహ్య భాగంతో గుర్తించబడతాము. శ్రీకృష్ణుడు మనల్ని అన్ని జీవులలో వ్యాపించి

38. క్రియ, ప్రతిక్రియ

చిత్రం
  మనకు కర్మ చేసే అధికారం ఉంది కానీ కర్మఫలం పై అధికారం లేదని శ్రీకృష్ణుడు చెప్పారు. దీనికి అర్థం మనల్ని అకర్మ (పని చేయకపోవడం) వైపు ఆకర్షితులవమని కాదు ; నిష్క్రియాత్మకత లేదా కేవలం పరిస్థితులకు ప్రతిస్పందించే వాళ్ళంగా మారిపోవడం కాదు.       శ్రీకృష్ణుడు అకర్మ అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ (దీని యొక్క సాహిత్యపరమైన అర్థం నిష్క్రియాత్మకమైనది) సందర్భపరంగా అది ప్రతిస్పందన ' ను కూడా సూచిస్తుంది. శ్లోకం 2.47 అవగాహన , కరుణల గురించి మాట్లాడుతుంది ; కర్మ , కర్మఫలాలు వేరు అనే అవగాహన ; ఇతరుల పట్ల మనకు మన పట్ల కరుణాభావం కలిగి ఉండాలని చెబుతుంది.       కర్మ చేయకుండా మన మనుగడే అసాధ్యమని శ్రీకృష్ణుడు చెప్పారు ( 3.8). భౌతిక శరీర నిర్వహణకు తినడం మొదలైన కర్మలు అవసరం. దానితోపాటు గుణాలు (సత్వ , తమో , రజో) నిరంతరం మనలను కర్మ వైపు నడిపిస్తాయి ( 3.5). అందుచేత అకర్మకు బహుశ ఎక్కడా చోటు లేదు.       వార్తలు చదువుతున్నప్పుడు , వింటున్నప్పుడు మనం మన ధోరణులను గమనిస్తే మతం , కులం , జాతీయత మొదలైన మన అభూత కల్పనలు , విశ్వాసాల గురించి మనం చూసినప్పుడు , విన్నప్పుడు లేదా చదివినప్పుడు ఈ కార్యకలాపాల ద్వారా మనలో ఉత్పన్న