38. క్రియ, ప్రతిక్రియ

 

మనకు కర్మ చేసే అధికారం ఉంది కానీ కర్మఫలం పై అధికారం లేదని శ్రీకృష్ణుడు చెప్పారు. దీనికి అర్థం మనల్ని అకర్మ (పని చేయకపోవడం) వైపు ఆకర్షితులవమని కాదు; నిష్క్రియాత్మకత లేదా కేవలం పరిస్థితులకు ప్రతిస్పందించే వాళ్ళంగా మారిపోవడం కాదు.

      శ్రీకృష్ణుడు అకర్మ అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ (దీని యొక్క సాహిత్యపరమైన అర్థం నిష్క్రియాత్మకమైనది) సందర్భపరంగా అది ప్రతిస్పందన'ను కూడా సూచిస్తుంది. శ్లోకం 2.47 అవగాహన, కరుణల గురించి మాట్లాడుతుంది; కర్మ, కర్మఫలాలు వేరు అనే అవగాహన; ఇతరుల పట్ల మనకు మన పట్ల కరుణాభావం కలిగి ఉండాలని చెబుతుంది.

      కర్మ చేయకుండా మన మనుగడే అసాధ్యమని శ్రీకృష్ణుడు చెప్పారు (3.8). భౌతిక శరీర నిర్వహణకు తినడం మొదలైన కర్మలు అవసరం. దానితోపాటు గుణాలు (సత్వ, తమో, రజో) నిరంతరం మనలను కర్మ వైపు నడిపిస్తాయి (3.5). అందుచేత అకర్మకు బహుశ ఎక్కడా చోటు లేదు.

      వార్తలు చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు మనం మన ధోరణులను గమనిస్తే మతం, కులం, జాతీయత మొదలైన మన అభూత కల్పనలు, విశ్వాసాల గురించి మనం చూసినప్పుడు, విన్నప్పుడు లేదా చదివినప్పుడు ఈ కార్యకలాపాల ద్వారా మనలో ఉత్పన్నమయ్యే అనుకూల, ప్రతికూల ప్రతిచర్యలను మనం గ్రహించ గలము. కుటుంబంలోను, కార్యాలయంలోనూ పరిస్థితులు గమనిస్తే ఎక్కువగా మాటల ద్వారా లేక చేతల ద్వారా చేయబడే ప్రతిస్పందనే కనిపిస్తుంది. ఈ ప్రతిస్పందన విభజనతో కూడిన మనసునుండి ఉద్భవిస్తుంది. పరిస్థితులు, వ్యక్తుల పట్ల ఇటువంటి ప్రతిక్రియ మన జీవితాల నుండి ఆనందాన్ని దూరం చేస్తుంది. ఎందుకంటే ఇది అవగాహన, కరుణల నుంచి ఉత్పన్నమయ్యే నిష్కామ కర్మల నుండి మనల్ని దూరం చేస్తుంది. అవగాహన ఉన్న మేధస్సు ఇతరుల దృక్కోణాలను బాగా అర్థం చేసుకుని తదనంతరం సానుభూతితో వ్యవహరించగలదు.

      ఇతరుల కర్మలకు ప్రతిస్పందనగా మనలో ఉత్పన్నమయ్యే అకర్మ (ప్రతిస్పందన) గురించి మనం తెలుసుకోవాలని శ్రీకృష్ణుడు సూచించారు. అదే సమయంలో ఇతరులలో ప్రతిచర్యను సృష్టించగల సామర్థ్యం ఉన్న కర్మలను చేయవద్దని; ఇతరులను కర్మరాహిత్యం దిశగా నెట్టే పనులను కూడా చేయవద్దని ఆయన మనకు సలహా ఇస్తారు. దీన్ని ఆచరించడం వల్ల మనం పరిపక్వత, సత్యనిష్ఠ, సంతోషం యొక్క అత్యున్నత స్థాయికి చేరుకోగలము.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

4. మనస్సు ఆడించే ఆటలు

6. శాసన నియమాలు

3. వర్తమానానిదే ప్రాధాన్యత