42. అహంకారపు వివిధ కోణాలు.
అహంకారం (నేను కర్తనే అన్న భావన)
అర్జునుడిని ఆవహించిందని, అదే అతని విషాదానికి కారణమని శ్రీకృష్ణుడు గమనించారు.
శ్రీకృష్ణుడు అర్జునుడికి అహంకారాన్ని విచ్ఛిన్నం చేయడానికి, అంతరాత్మ దాకా చేరుకోడానికి సమగ్ర బుద్ధిని ఉపయోగించమని సలహా ఇస్తారు (2.41).
,
అహంకారానికి
అనేక రూపాలున్నాయి. గర్వం అహంకారంలో ఒక చిన్న భాగం. ఎవరన్నా విజయం/గెలుపు/లాభం అనే
ధ్రువాల గుండా వెళుతున్నప్పుడు ఆ అహంకారాన్ని అభిమానం అంటారు. ఎవరైనా
నష్టం/వైఫల్యం/ఓటమి అనే బాధాకరమైన ధ్రువాల గుండా వెళుతున్నప్పుడు ఆ అహంకారాన్ని
నిరాశ/దుఃఖం/ క్రోధం అంటారు. ఇతరులు సుఖమనే ధృవాల ద్వారా వెళుతున్నప్పుడు మనలోని
అహంకారం అసూయగా మారుతుంది. ఎవరన్నా ఆ దుఃఖమనే ధ్రువణతలో ఉంటే అదే సానుభూతిగా
మారుతుంది.
మనం
భౌతిక ఆస్తులను కూడబెడుతున్నప్పుడు, వాటిని
పోగొట్టుకున్నప్పుడు కూడా ఇది ఉంటుంది. ఇది లోకంలో కర్మ చేయడం లేక సన్యాసం
స్వీకరించడానికి ప్రేరేపిస్తుంది. ఇది సృష్టితో పాటు వినాశనానికి కూడా కారణం. అది
జ్ఞానంలోనూ, అజ్ఞానంలోనూ ఉంది.
ప్రశంసలు
అహంకారాన్ని పెంచుతాయి; విమర్శలు బాధ పెడతాయి. ఈ రెండు దశలూ మనల్ని ఇతరులు
తారుమారు చేసేందుకు అనుకూలంగా మారుస్తాయి. సంక్షిప్తంగా, ప్రతి
భావోద్వేగం వెనుక ఏదో ఒక రూపంలో అహంకారం ఉంటుంది. ఈ భావోద్వేగాలు మన బాహ్య
ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. అహంకారం మనల్ని విజయం, శ్రేయస్సు
వైపు నడిపించేలా కనిపించవచ్చు. కానీ అది తాత్కాలిక తృప్తి కోసం మాదకద్రవ్యాలను
తీసుకోవడం లాంటిది.
'నేను', 'నాది', 'నన్ను',
'నాకు' అనేవి అహంకారానికి కాళ్ల వంటివి.
రోజువారీ సంభాషణలు, ఆలోచనలలో ఈ పదాలను ఉపయోగించకుండా ఉండటం
ద్వారా అహంకారాన్ని చాలా వరకు బలహీనపరచవచ్చు.
మనల్ని
మనం ఒక ధృవలక్షణముతో లేదా మరొకదానితో గుర్తించాలని కోరుకున్నప్పుడు అహంకారం
పుడుతుంది. అందుకే శ్రీకృష్ణుడు 2.48 లో అర్జునుడిని అహంకారానికి
చోటివ్వని నిర్వికల్ప స్థితిలో సమత్వ భావాన్ని కలిగియుండమని సలహా ఇచ్చారు.
స్థూలంగా బాల్యంలో వ్యవహరించినట్లు, ఆకలితో ఉన్నప్పుడు ఆహారం
తీసుకోవాలి; చల్లగా ఉన్నప్పుడు వెచ్చని బట్టలు ధరించాలి;
అవసరమైనప్పుడు భావాలను అరువు తెచ్చుకోవాలి కానీ అవే మన అసలైన
గుర్తింపుగా భావించరాదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి