49. స్థితప్రజ్ఞత అనేది అంతర్గత ఘటన

శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా స్థితప్రజ్ఞుడు తన పట్ల తాను సంతృప్తితో ఉంటాడని చెప్పారు. స్థితప్రజ్ఞత గలవారు ఎలా మాట్లాడుతారు , కూర్చుంటారు , నడుస్తారు అనే అర్జునుడి ప్రశ్న యొక్క రెండవ భాగానికి శ్రీకృష్ణుడు స్పందించలేదు. ' స్వయం తో సంతుష్టి ' అనేది పూర్తిగా అంతర్గత ఘటన. బాహ్య ప్రవర్తన ఆధారంగా దానిని కొలవడానికి అవకాశం లేదు. బహుశా ఉన్న పరిస్థితులలో అజ్ఞాని , స్థితప్రజ్ఞుడు ఇద్దరూ ఒకే మాటలు మాట్లాడవచ్చు ; అదే పద్ధతిలో కూర్చోవచ్చు ; నడవచ్చు ; ఇది స్థితప్రజ్ఞతను గురించి మన అవగాహనను మరింత క్లిష్టతరం చేస్తుంది. . కృష్ణుని జీవితం స్థితప్రజ్ఞుని జీవితానికి ఉత్తమ ఉదాహరణ. ఆయన పుట్టుకతోనే తల్లిదండ్రుల నుండి విడిపోయారు. ఆయన్ను ' వెన్న దొంగ ' అని పిలిచేవారు. ఆయన శృంగారం , నృత్యం , వేణువు పౌరాణికమైనవి కానీ ఆయన బృందావనం విడిచి పెట్టాక శృంగారాన్ని కోరుతూ తిరిగి రాలేదు. ఆయన అవసరమైనప్పుడు పోరాడారు ; చంపారు. కానీ కొన్ని సమయాల్లో యుద్ధానికి దూరంగా ఉన్నారు. అందుకే ' యుద్ధం నుండి పారిపోయే వ్యక్తి ' అని పిలువబడ్డారు. ఎన్నో అద్భుతాలు చేసారు. స్నేహితులకు స్నేహ