43. యోగంతో అభిప్రాయాలు కనుమరుగు
మన యొక్క ఇతరుల యొక్క పనులు, నిర్ణయాలు, మంచివి లేదా చెడ్డవని పేరుపెట్టడం చుట్టూ
మన జీవితాలు అల్లుకుంటాయి. "సమత్వ బుద్ధియుక్తుడైనవాడు
పుణ్యపాపములను రెండింటిని ఈ లోకమునందే త్యజించును” అని
శ్రీకృష్ణుడు చెప్పారు (2.50). అంటే ఒకసారి మనమీ సమత్వ
యోగాన్ని చేరుకున్న తర్వాత ఇలా పేర్లు పెట్టడం వదిలేస్తాము; అభిప్రాయాలకు
తావు ఇవ్వము.
మన
మనస్సు అనేక రంగుటద్దాలతో కప్పబడి ఉంటుంది. ఎదిగే సమయంలో మన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల నియంత్రణ ద్వారా అలాగే
మనముంటున్న దేశం యొక్క చట్టం ద్వారా మనలో ఇవన్నీ ముద్రించబడతాయి. మనము ఈ
రంగుటద్దాల ద్వారానే విషయాలు/పనులను చూస్తూ ఉంటాము; వాటిని
మంచి లేదా చెడుగా ముద్ర వేస్తాము. యోగం ఈ రంగులన్నీ స్వయంగా కరిగిపోయి అన్ని
విషయాలను స్పష్టంగా చూడగలిగేలా చేస్తుంది. ఇది రెమ్మలకు బదులుగా మూలాలను నాశనం
చేయడం; మన స్వంత రంగును జోడించడానికి ప్రయత్నించకుండా
పరిస్థితులను ఉన్నవి ఉన్నట్లుగా అంగీకరించడం వంటిది.
జీవితంలో
ఈ రంగుటద్దాలు మనల్ని ముడుచుకుపోయేటట్లు చేస్తాయి. తద్వారా నిర్ణయాలు
తీసుకోవడానికి అవసరమైన కీలకమైన సమాచారాన్ని కోల్పోతాము. సరిపోని లేదా తప్పుగా
అన్వయించబడిన సమాచారంతో తీసుకున్న నిర్ణయాలు, పనులు అనివార్యంగా
విఫలమవుతాయి.
తటస్థంగా
ఉండడం అంటే ఒక విద్యార్థి ఒక సమస్యకు అనుకూలంగా మరియు వ్యతిరేకంగా ఏకకాలంలో
వాదించాల్సిన చర్చ లాంటిది. ఇది చట్టం లో చెప్పినట్లు, మనం నిర్ణయాలు తీసుకునే ముందు రెండు పక్షాల వారి మాటలూ వినడం లాంటిది. ఇది
అన్ని జీవులలో తనను, అన్ని జీవులను తనలోనూ చూడడం వంటిది.
అంతిమంగా సర్వత్ర కృష్ణమయమే (6.29). ,
పరిస్థితిలో
మనం కూరుకుపోకుండా మనల్ని మనం వేరు చేసుకుని, పరిస్థితి యొక్క
రెండువైపులను అర్థం చేసుకునే సామర్థ్యం ఇది. ఈ సామర్ద్యం వికసించాక “దారుమ” బొమ్మలాగా మధ్యలో మనల్ని మనం
కేంద్రీకరించుకోవడం మొదలు పెడతాం.
ఎవరైనా
క్షణికమైన యోగ స్థితిని (సమతుల్యత) పొందినప్పుడు కూడా, ఆ సమయంలో వారి ద్వారా చేయబడేపని సమంజసంగా ఉంటుంది. ఆధ్యాత్మికతను గణాంక
కోణంలో చూస్తే ఇది ఒక వ్యక్తి సమతుల్యతలో ఉన్న సమయం యొక్క శాతమే. ఈ యాత్ర దానిని
వంద శాతానికి పెంచడానికే!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి