49. స్థితప్రజ్ఞత అనేది అంతర్గత ఘటన
శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రశ్నకు
సమాధానంగా స్థితప్రజ్ఞుడు తన పట్ల తాను సంతృప్తితో ఉంటాడని చెప్పారు. స్థితప్రజ్ఞత
గలవారు ఎలా మాట్లాడుతారు, కూర్చుంటారు, నడుస్తారు అనే
అర్జునుడి ప్రశ్న యొక్క రెండవ భాగానికి శ్రీకృష్ణుడు స్పందించలేదు.
'స్వయం తో సంతుష్టి' అనేది పూర్తిగా అంతర్గత ఘటన.
బాహ్య ప్రవర్తన ఆధారంగా దానిని కొలవడానికి అవకాశం లేదు. బహుశా ఉన్న పరిస్థితులలో
అజ్ఞాని, స్థితప్రజ్ఞుడు ఇద్దరూ ఒకే మాటలు మాట్లాడవచ్చు;
అదే పద్ధతిలో కూర్చోవచ్చు; నడవచ్చు; ఇది స్థితప్రజ్ఞతను గురించి మన అవగాహనను మరింత క్లిష్టతరం చేస్తుంది. .
కృష్ణుని
జీవితం స్థితప్రజ్ఞుని జీవితానికి ఉత్తమ ఉదాహరణ. ఆయన పుట్టుకతోనే తల్లిదండ్రుల
నుండి విడిపోయారు. ఆయన్ను 'వెన్న దొంగ' అని పిలిచేవారు. ఆయన
శృంగారం, నృత్యం, వేణువు పౌరాణికమైనవి
కానీ ఆయన బృందావనం విడిచి పెట్టాక శృంగారాన్ని కోరుతూ తిరిగి రాలేదు. ఆయన
అవసరమైనప్పుడు పోరాడారు; చంపారు. కానీ కొన్ని సమయాల్లో
యుద్ధానికి దూరంగా ఉన్నారు. అందుకే 'యుద్ధం నుండి పారిపోయే
వ్యక్తి' అని పిలువబడ్డారు. ఎన్నో అద్భుతాలు చేసారు.
స్నేహితులకు స్నేహితుడు. వివాహ సమయం వచ్చినప్పుడు ఆయన వివాహం చేసుకుని కుటుంబాలను
పోషించారు. దొంగతనం అంటగట్టిన తప్పుడు ఆరోపణలను నివారించడానికి శమంతకమణి జాడను
కనిపెట్టారు. గీతాజ్ఞానం ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన దానిని ఇచ్చారు. ఆయన
కూడా సాధారణ వ్యక్తిలా మరణించారు.
మొదట
గుర్తించాల్సిన అంశం, బయట కనిపించే ఆయన జీవితంలో ఓ క్రమ పద్ధతి అంటూ ఏమీ
కనిపించదు. కానీ ఆంతరంగికంగా వర్తమానంలో తన జీవితాన్ని జీవించారు. రెండోది,
అనేక ప్రతికూల పరిస్థితులు, సమస్యలు
ఎదురైనప్పటికీ ఆయన జీవితం నిరంతరం ఉత్సాహంగా ఆనందమయంగా సాగింది. మూడవది, శ్లోకం 2.47 లో పేర్కొన్నట్లుగా 'స్వయంతో సంతృప్తి' అంటే 'క్రియాశూన్యత'
కాదు. కర్తృత్వ భావన లేకుండా, కర్మఫలాలను
ఆశించకుండా కర్మలు నిర్వహించడం.
ఇది
గతం యొక్క భారం లేదా భవిష్యత్తు నుంచి ఎటువంటి ఆశ లేకుండా వర్తమానంలో జీవించడం.
ప్రణాళిక రూపొందించడం మొదలు పని పూర్తి చేసే వరకు ప్రతిదీ వర్తమానంలో జరుగుతుందనే
అవగాహన.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి