56. ఆధ్యాత్మికత యొక్క కారణం, ప్రభావం

“ మనఃప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖము లన్నియును నశించును. ప్రసన్నచిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ది అన్ని విషయముల నుండి వైదొలగి , పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమగును ” అని శ్రీకృష్ణుడు బోధపరుస్తున్నారు ( 2.65). మన కోరికలన్నీ తీరిన తర్వాత మనం సంతుష్టి చెంది సుఖాన్ని పొందుతాము ; దుఃఖాన్ని దూరం చేసుకుంటామని మనం భావిస్తుంటాము. కానీ శ్రీకృష్ణుడు మనల్ని మొదట సంతుష్టి చెందమని మిగిలినవి వాటంతటవే అనుసరిస్తాయని చెప్తున్నారు. ఉదాహరణకు , మనకు జ్వరం , నొప్పులు మొదలైన లక్షణాలు ఉంటే మనం ఆరోగ్యంగా లేమని నిర్ధారిస్తాము. ఈ లక్షణాల మూలాలకు చికిత్స చేయకుండా వీటిని అణచివేయడం వల్ల మన ఆరోగ్యం కుదుటపడదు. పోషకాహారం , మంచి నిద్ర , వ్యాయామము మొదలైనవి మనకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అదే విధంగా అసంతృప్తికి కారణమైన భయం , క్రోధం , ద్వేషం అనేవి మనలో సంతృప్తి లేకపోవడాన్ని సూచిస్తాయి. వాటిని కృత్రిమంగా అణచివేయడం మూలంగా మనము సంతృప్తి చెందము. క్రోధము , ద్వేషాన్ని అణిచివేసి సమాజంలో ఆమోదయోగ్యమైన ప్రవర్తనను ప్రదర్శించడానికి అనేక శీఘ్ర పరిష్కారాలు బోధించ బడ్డాయి ; ప్రస్తుత కాలంలో ఆచరణలో కూడా ఉన్నాయి. కానీ ఈ