50. రాగం, భయం, క్రోధం
దుఃఖములకు కృంగిపోనివాడును, సుఖములకు పొంగిపోని వాడును, రాగము, భయము, క్రోధము లేని వాడిని స్థితప్రజ్ఞుడు అందురు”
అని శ్రీకృష్ణుడు చెప్పారు (2.56). సుఖం-దుఃఖం,
లాభం - నష్టం; విజయం-అపజయాలను సమానంగా
భావించమని శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశానికి (2.38) ఇది
కొనసాగింపు.
మనమందరం
సుఖాన్ని కోరుకుంటాము కానీ దుఃఖం అనివార్యంగా మన జీవితాల్లోకి వస్తుంది. ఎందుకంటే
అవి రెండూ ద్వంద్వ (ధ్రువ) జంటలుగా ఉన్నాయి. ఇది ఎర వెనుక కొక్కెం దాగి ఉన్న చేపల
ఎర లాంటిది. మరోవైపు కష్టంతో కూడిన పరిశ్రమ ఎల్లప్పుడూ ప్రతిఫలాన్ని తెస్తుంది.
స్థితప్రజ్ఞుడు
అంటే ఈ ధ్రువాలను అది గమించి ద్వంద్వాతీతుడైన వాడు. మనం ఒకదానిని ఆశిస్తున్నప్పుడు
బహుశా వేరే ఆకారంలో లేక కొంత సమయం గడిచిన తర్వాత దాని విపరీతము అయిన రెండో ధృవం
మనని అనుసరించడానికి బాధ్యలవుతామన్న అవగాహన.
మన
ప్రణాళికతో మనం సుఖాన్ని పొందినప్పుడు అహంకారం ఉప్పొంగిపోతుంది. అది ఉత్తేజం తప్ప
మరేమీ కాదు. అయితే అది దుఃఖంగా మారినప్పుడు అహంకారం గాయపడుతుంది. ఇది ఉద్రేకం, క్రోధం తప్ప మరేమీ కాదు, ఇది నిస్సందేహముగా అహంకారం
యొక్క ఆటని సూచిస్తుంది. స్థితప్రజ్ఞుడు దానిని గ్రహించి అహంకారాన్ని
వదిలివేస్తాడు.
శ్రీకృష్ణుడు
'స్థితప్రజ్ఞుడు రాగం నుండి విముక్తి పొందాడని' చెప్పినప్పుడు
స్థితప్రజ్ఞుడు వైరాగ్యం వైపు ఆకర్షితులవుతారని అర్ధం కాదు. వారు ఈ రెండింటినీ అధిగమించిన
స్థితిలో ఉంటారు. ఈ విషయాన్ని మనం అర్ధం చేసుకోవడం కష్టం ఎందుకంటే ధృవాలను
అధిగమించిన స్థితిని వర్ణించడానికి భాషల్లో తగినన్ని శబ్దాలు లేవు.
భయం, క్రోధం నుండి స్థిత ప్రజ్ఞులు విముక్తి పొందారంటే వారు వాటిని
అణిచివేస్తారని అర్థం కాదు. భయం, క్రోధాలు తమలో
ప్రవేశించడానికి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా అవి తమలో ఉండడానికి వారు చోటుంచరు.
భయం, క్రోధం అనేవి భవిష్యత్తు గురించి ఆందోళన లేక గత కాలము యొక్క గాయాలను
గుర్తు తెచ్చుకోవడం. అలాగని వర్తమానంలో రెండింటికీ చోటు లేదు. స్థితప్రజ్ఞులు భయం,
క్రోధం నుండి విముక్తి పొందారని శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు వారు
వర్తమానంలోనే జీవించడాన్ని సూచిస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి