51. విరక్తి కూడా ఒక అనుబంధమే

 

మనం ఒక పరిస్థితిని, ఒక వ్యక్తిని లేదా ఒక పని యొక్క ఫలితాన్ని మంచి, చెడుగా విభజిస్తాము. ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యని మూడవ స్థితి కూడా సంభవమే. శ్రీకృష్ణుడు ఈ మూడవ స్థితిని ప్రస్తావిస్తూ, “దేనియందును మమతాసక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోను కానివాడును అగు పురుషుడు స్థిత ప్రజ్ఞుడు అనబడునుఅని చెప్తారు (2.57). స్థితప్రజ్ఞుడు (2.50) తన స్వంత అభిప్రాయాల్ని వదిలివేసి వాస్తవాలను వాస్తవాలుగా తీసుకుంటాడని ఇది సూచిస్తుంది, ఎందుకంటే ఇలా మంచి లేదా చెడు అనే విభజనే సుఖదుఃఖాలనే ద్వంద్వాలకు జన్మస్థలం. .

      పరిస్థితులను, వాస్తవాలను తక్షణమే మంచి లేదా చెడు అని పేర్కొనే మన ధోరణికి విరుద్ధంగా ఈ బోధన నడుస్తుంది కాబట్టి కఠినమైనది గా అనిపిస్తుంది. చెడుగా అనిపించే పరిస్థితి లేదా వ్యక్తిని ఎదుర్కొన్నప్పుడు అయిష్టత, విరక్తి, ద్వేషం స్వయంచాలకంగా అనుసరిస్తాయి. కాని స్థితప్రజ్ఞుడు ఏ పరిస్థితి గురించి అభిప్రాయాన్ని ఏర్పరచుకోడు కాబట్టి అతనిలో ద్వేషం యొక్క పుట్టుకకు అవకాశమే లేదు. అదే విధంగా మంచిని చూసినప్పుడు స్థితప్రజ్ఞుడు పొంగిపోడు.

      ఉదాహరణకు మనందరిలో అందం, ఆకర్షణ, శక్తి కోల్పోయి కాలక్రమేణా సహజ ప్రక్రియలో వృద్ధాప్యమనే గమ్యాన్ని చేరుకుంటాయి. ఇవి కేవలం ప్రాకృతిక వాస్తవాలు. కానీ మనం వాటిని అప్రియమైనవి లేదా చెడువని భావిస్తే అవి మనకు దుఃఖాన్ని తెస్తాయి. గాయం లేదా అనారోగ్యం వంటి విషయాలలో సరైన చికిత్స వైపు ధ్యాస పెట్టకుండా ప్రస్తుత పరిస్థితులను చెడుగా భావించడమే దుఃఖము.

      ఒక శస్త్ర వైద్యుడు (సర్జన్) ఎవరైతే పరీక్షా సమయంలో బయటపడిన స్వచ్ఛమైన వాస్తవాల ఆధారంగా శస్త్రచికిత్స చేస్తాడో అతనిలాగా స్థితప్రజ్ఞుడు పరిస్థితులను ఎదుర్కొంటాడు. ఒక సూపర్కండక్టర్ ఎలాగైతే మొత్తం విద్యుత్తును ఆసక్తి లేకుండా స్వేచ్ఛగా ప్రవహింప చేస్తుందో స్థితప్రజ్ఞుడు కూడా ఆసక్తి లేకుండా జీవిస్తాడు.

      మనం పరిస్థితులు, వ్యక్తులు, పనులంటే ఇష్టంతో గాని లేదా అయిష్టంతో గాని ఉంటాము. ఇష్టాన్ని అనుబంధంగా అర్థం చేసుకోవడం చాలా సులభం అయితే అయిష్టం కూడా ఒక రకమైన అనుబంధమే, కాకపొతే ద్వేషానికి. శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞునికి మమతాసక్తులు లేవని చెప్పినప్పుడు వారు ఇష్టాల్ని, అయిష్టాల్ని రెండింటినీ వదిలివేస్తారని అర్థం.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

1. అహంకారం తో ఆరంభం

4. మనస్సు ఆడించే ఆటలు

6. శాసన నియమాలు