52. ఉపసంహరించుకోవడమే వివేకం

 


తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకొనునట్లుగా, ఇంద్రియములను ఇంద్రియార్థముల (విషయాదుల) నుండి అన్నివిధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను.అని శ్రీకృష్ణుడు చెప్తున్నారు (2.58).

      శ్రీకృష్ణుడు ఇంద్రియాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే అవి మన అంతర్గత, బాహ్య ప్రపంచాలకి మధ్య ద్వారముల వంటివి. తాబేలును ఉదాహరణగా తీసుకుంటే అది ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుడు దాని అవయవాలను లోపలికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియ వస్తువులతో ఇంద్రియాలు జతకూడటం గమనించినప్పుడు మన ఇంద్రియాలను ఉపసంహరించుకోవాలని ఆయన సలహా ఇస్తున్నారు.

      ప్రతి ఇంద్రియానికి రెండు భాగాలు ఉంటాయి. ఒకటి బయటకు కనిపించే కన్ను వంటి బాహ్య ఇంద్రియ పరికరం. రెండవది ఈ కన్నును నియంత్రించే మెదడులోని ఇంద్రియ నియంత్రక భాగం.

      ఇంద్రియముల ఇంద్రియార్థముల మధ్య పరస్పర స్పందనలు రెండు స్థాయిలలో జరుగుతాయి. మొదటిది, కాంతి యొక్క కణాలు (ఫోటాన్లు) బాహ్య ఇంద్రియ పరికరమైన కన్నును చేరినప్పుడు కన్ను స్వయంచాలకంగా కాంతికి స్పందిస్తుంది. అలాగే మిగతా ఇంద్రియ పరికరాలు కూడా తమ తమ ఇంద్రియ విషయాలకు స్వయంచాలకంగా స్పందిస్తాయి. రెండవది, బాహ్య ఇంద్రియాలకు వాటిని నియంత్రించే మెదడులోని భాగాలకు మధ్య జరిగేది.

      చూడాలన్న కోరికే కంటి వికాసానికి కారణం. ఆ కోరిక ఇప్పటికీ ఇంద్రియ నియంత్రక భాగంలో ఉంది. సాంకేతికపరంగా దీనిని 'ప్రేరేపిత దృష్టి' (motivated perception) అని పిలుస్తారు. ఇక్కడ మనం చూడాలనుకుంటున్న వాటినే చూస్తాము; మనం వినాలనుకుంటున్నదే వింటాము; కాని సమగ్రాన్ని చూడలేకపోతాము. ఇది క్రికెట్ ఆటలో ప్రత్యర్థికి అనుకూలంగా ఉండే అధిక నిర్ణయాలను మనం ఊహించుకొని అంపైర్ అన్యాయం చేస్తున్నాడని నిర్ధారించు కున్నట్లుగా ఉంటుంది.

      శ్రీకృష్ణుడు ఇంద్రియాల గురించి ప్రస్తావించినప్పుడు ఆయన కోరికలను ఉత్పత్తి చేసే ఇంద్రియ నియంత్రక భాగం గురించి మాట్లాడుతున్నారు. అందుకే మనం మన ఇంద్రియాలను భౌతికంగా మూసివేసినప్పటికీ మన కోరికలను సజీవంగా ఉంచడానికి మనస్సు తన ఊహా శక్తిని ఉపయోగిస్తుంది. ఎందుకంటే మనస్సు ఈ నియంత్రకాలన్నింటి కలయిక కాబట్టి.

      ఇంద్రియ నియంత్రకాలను ఇంద్రియాల యొక్క భౌతిక భాగం నుండి వేరు చేయమని శ్రీకృష్ణుడు ఈ శాస్త్రీయ శ్లోకం ద్వారా మనకు మార్గనిర్దేశం చేస్తున్నారు. తద్వారా మనం ఎప్పుడూ ఉత్తేజకరమైన లేదా నిరుత్సాహపరిచే బాహ్య పరిస్థితుల నుండి అసలైన స్వేచ్ఛను (మోక్షం) పొందుతాము. అటువంటి పరిస్థితుల నుండి ఎప్పుడు వెనకడుగు వేయాలో తెలుసుకోవడమే వివేకం.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

6. శాసన నియమాలు

42. అహంకారపు వివిధ కోణాలు.

73. సమర్పణ కళ