53. ఇంద్రియ విషయవాంఛను వదులుకోవడం


 

ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహించని వ్యక్తి నుండి, ఇంద్రియ వస్తువులు దూరమైపోతాయి కానీ 'రస్' (కాంక్ష/ రాగం) విడనాడదు. పరమాత్మను తెలుసుకున్నప్పుడు మాత్రమే కోరిక అంతమై పోతుందిఅని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు (2.59). ఇంద్రియాలకు భౌతిక పరికరం, మెదడులో ఒక నియంత్రకం ఉంటాయి. మనస్సు అనేది అన్ని ఇంద్రియ నియంత్రకాల కలయిక. కోరికలకు స్థానమైన ఈ నియంత్రకాలపై దృష్టి సాధించమని శ్రీకృష్ణుడు మనకు సలహా ఇస్తున్నారు.

శ్రీకృష్ణుడు 'రస్' (రసం) అనే పదాన్ని ఉపయోగిస్తారు. పండిన పండ్లను కోసి పిండినప్పుడు తప్ప రసం కనిపించదు; పాలలో ఉన్న వెన్న పరిస్థితి కూడా అంతే. అలాగే 'రన్' అనేది ఇంద్రియ నియంత్రకాలలో ఉండే అంతర్గత కోరిక.

అజ్ఞాన స్థాయిలో, ఇంద్రియాలు ఇంద్రియ వస్తువులతో జతచేయబడతాయి; సుఖదుఃఖాల యొక్క ద్వంద్వాల మధ్య ఊగిస లాడుతూ ఉంటాయి. తదుపరి దశలో కోరికలను తీర్చు కోవడానికి మార్గం లేక ఆ కోరికలను వదిలి వేస్తాము. ఉదాహరణకి, డబ్బు లేకపోవడం లేదా వైద్యుల సలహా వంటి బాహ్య పరిస్థితుల కారణంగా మిఠాయి వంటి ఇంద్రియ వస్తువులను వదిలేస్తాము కానీ మిఠాయిపై కోరిక మిగిలిపోతుంది. నైతికత, దేవుడు లేక చట్టం పట్ల భయం, ప్రతిష్ట పోతుందన్న అనుమానం, వృద్ధాప్యం లాంటి బాహ్యా పరిస్థితుల వలన కోరికలను వదిలివేస్తాము. ఏ కారణం లేకుండా అన్ని కోరికలను వదిలివేసే పరమ దశ గురించి శ్రీకృష్ణుడు పై శ్లోకంలో సూచిస్తున్నారు.

శ్రీకృష్ణుడు శ్రీమద్భాగవతం (11.20. 21) లో ఒక ఆచరణాత్మక చిట్కాను ఇచ్చారు. అక్కడ ఆయన ఇంద్రియాలను అడవి గుర్రాలతో పోల్చారు. శిక్షకుడు కొంత కాలం వాటితో పాటు పరిగెత్తి వాటిని నియంత్రణలోకి తీసుకొస్తాడు. వాటిని పూర్తిగా అర్ధం చేసుకున్నప్పుడు అతను తన ఇష్టానుసారం వాటిపై స్వారీ చేయడం ప్రారంభిస్తాడు.

ఇక్కడ గమనించవలసిన రెండు అంశాలు ఏమిటంటే శిక్షకుడు గుర్రాలను ఒక్కసారిగా నియంత్రించలేడు ఎందుకంటే అవి అతనిని క్రింద పడవేయ గలవు. అదేవిధంగా, మనం ఇంద్రియాలను ఒక్కసారిగా నియంత్రించడం ప్రారంభించలేము. మనం వాటిని అర్థం చేసుకుని నెమ్మదిగా అదుపులోకి తెచ్చే వరకు, వాటి వ్యవహారాల ప్రకారం కొంత సమయం పాటు నడుచుకోవాలి. రెండవది, మనం ఈ ఇంద్రియాల ప్రభావంలో ఉన్నప్పుడు వాటిని ప్రస్తుతానికి నియంత్రించలేకపోయినా మనం రాబోయే సమయము (భవిష్యత్తు) లో నియంత్రించాలన్న నిరంతర అవగాహన కలిగి ఉండాలి.

ఒక ఒరలో రెండు కత్తులు ఇమడనట్లు అవగాహన, కోరికలలో ఏదో ఒకటి మాత్రమే మనలో ఉండగలదు. అవగాహనలో ఉన్నప్పుడు మనల్ని కోరికలు అధీనంలోకి తీసుకోలేవు ఎందుకంటే అజ్ఞానంలోనే అలా జరుగుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

1. అహంకారం తో ఆరంభం

4. మనస్సు ఆడించే ఆటలు

6. శాసన నియమాలు