62. 'నేను' అనే భావనను త్యజించడం

“ నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా , ఈ ప్రపంచంలో మోక్షానికి రెండు మార్గాలు ఉన్నాయి - జ్ఞానులు జ్ఞానం ద్వారా , యోగులు కర్మ మార్గం ద్వారా మోక్షాన్ని పొందుతారు ” అని శ్రీకృష్ణుడు సమాధానము ఇస్తారు ( 3.3). ఈ శ్లోకం బుద్ధి ఆధారితమైన వారికి అవగాహన మార్గం , మనస్సు ఆధారితమైన వారికి కర్మ మార్గమని సూచిస్తుంది. ఈ విషయాన్ని మరింత వివరిస్తూ శ్రీకృష్ణుడు , “ కేవలం కర్మలను ఆచరించకుండా , ఎవ్వరు నైష్కర్మ్యం పొందలేరు ; కేవలం కర్మలను త్యజించడం ద్వారా సిద్ధిని పొందలేరు ” అని స్పష్టం చేశారు ( 3.4). సాధారణ వ్యక్తి చేయలేని పనిని త్యాగం చేసేవారు చేస్తారు కాబట్టి దాదాపు అన్ని సంస్కృతులలో పరిత్యాగం కీర్తించబడుతుంది. అందుకే అర్జునుడు రాజ్యం యొక్క విలాసాన్ని , యుద్ధం యొక్క బాధను త్యజించాలనుకున్నప్పుడు అతని దృక్పథం మనలో చాలా మందిని ఆకర్షిస్తుంది. శ్రీకృష్ణుడు కూడా త్యజించడాన్ని ఇష్టపడతారు అయితే మన కర్మలు అన్నింటిలో ' నేను ' అనే భావనను త్యాగం చేయమని చెబుతారు. శ్రీకృష్ణునికి నిర్మమ , నిరహంకార శాశ్వత స్థితికి మార్గాలు ( 2.71). శ్రీకృష్ణుడికి యుద్ధం సమస్య కాదు ; అర్జునుడిలోని ' నేను ' అనేదే సమస్య.