70. సమయానికి అవకాశం ఇవ్వండి

ఒక కాయ దాని తల్లి చెట్టు నుండి పోషకాలను గ్రహిస్తూ వృద్ధి చెందుతుంది. తరువాత అది తన స్వంత ప్రయాణాన్ని ప్రారంభించడానికి చెట్టు నుండి వేరు అవుతుంది. విత్తనము నుంచి చివరకు చెట్టుగా మారేవరకు , వివిధ దశలను కలిగి ఉంటుంది. మరోవైపు , అపరిపక్వ కాయ పండే వరకు , అంటే తన యాత్రను స్వయంగా ఆరంభించే దక్షత వచ్చేవరకు తల్లి చెట్టుకు అంటిపెట్టుకుని ఉండాలి. పండిన పండు , అపరిపక్వమైన కాయను చెట్టును విడిచి పెట్టడానికి ఆకర్షించకూడదు ఎందుకంటే అపరిపక్వ కాయ స్వతంత్ర ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇంకా సిద్ధంగా లేదు. మాతృచెట్టు నుండి అవసరమైన పోషణ పొందడానికి సమయం కేటాయించకపోతే అది నశిస్తుంది. ఈ పోషణ పండిన పండు నుంచి పొందే అవకాశం లేదు. ఇదే పంథాలో , శ్రీకృష్ణుడు పరమాత్మస్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో (ఫలాసక్తితో) ఆచరించు అజ్ఞానులను భ్రమకు లోను చేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా , తాను కూడ శాస్త్ర విహితములైన సమస్తకర్మలను చక్కగా చేయుచు వారితోగూడ అట్లే చేయింపవలెను ” అని సలహా ఇస్తారు ( 3.26). ఇది కర్మేంద్రియాలను బలవంతంగా నియంత్రించే వ్యక్తుల గ