76. కామము పట్ల జాగ్రత్త వహించాలి
“ ఓ కృష్ణా! మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరులు బలవంతము చేసినట్లుగా , దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములను చేయు చుండును ?” అని అర్జునుడు అడిగాడు ( 3.36). “ రజోగుణమునుండి ఉత్పన్నమగునదే కామము. ఇదియే క్రోధరూపమును దాల్చును. ఇది మహాశనము. భోగానుభవములతో ఇది చల్లారునది గాదు. పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇదియేప్రేరకము. కనుక ఈ విషయమున దీనిని పరమ శత్రువుగా ఎఱుంగుము. ” అని శ్రీకృష్ణుడు చెప్పారు ( 3.37). శ్రీకృష్ణుడు కామం అనే పదాన్ని ఉపయోగిస్తారు. అంటే కోరిక యొక్క తీవ్ర రూపం. కర్మతో అనుబంధం అనేది రజోగుణం యొక్క ముఖ్య లక్షణం. ఉదాహరణకి ఒక వాహనం విషయంలో కదలిక లేదా వేగం అనేది రజోగుణం నుండి పుట్టిన గుణం ; దీనిని సాధించడానికి యాక్సిలరేటర్ ఒక పరికరం. అదే విధంగా మందగించడం లేదా జడత్వం తమస్సు యొక్క స్వభావం ; దీని కోసం బ్రేక్ ఒక పరికరం. డ్రైవర్ సత్వగుణానికి ప్రతినిధి ; సురక్షితంగా వెళ్లడానికి త్వరణం , బ్రేకింగ్ ని సంతులనం చేస్తాడు. స్పీడోమీటర్ అనేది అవగాహన కోసం ఒక పరికరం. వీటి మధ్య సంతులనం తప్పిపోతే ప్రమాదం తప్పదు. కామం కూడా మన జీవితాల్లో సమతుల్యత కోల్పోవడం తప్ప మర