73. సమర్పణ కళ


 

అంతర్యామిని, పరమాత్మను ఐన నాయందే నీ చిత్తమును ఉంచి, కర్మలనన్నింటినీ నాకే అర్పించి, జ్వరం, ఆశా మమతా సంతాపములను వీడి యుద్ధము చేయుముఅని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించారు (3.30). ఈ శ్లోకం భగవద్గీత యొక్క సారాంశం; ఇది రోజువారీ జీవితంలో మన సందేహాలకు సమాధానం ఇస్తుంది.

      మన మొదటి సందేహం 'ఏం చెయ్యాలి' అనేది. సామాన్యంగా మనం చేసే పనిలో మనకు సంతృప్తి లేకపోవటం వల్ల, ఇంకేదో పనిలో సుఖం ఉంటుందని మనకు అనిపిస్తుంది. కానీ ఈ శ్లోకం 'చేతిలో ఉన్న పనిని చేయమని' సలహా ఇస్తుంది. ఆ పని మనం కోరుకున్నది కావచ్చు లేదా మనకు ఈ ప్రకృతి కేటాయించింది కావచ్చు. అది ఒకరినొకరు చంపుకునే కురుక్షేత్ర యుద్ధం వలె క్రూరమైనది, సంక్లిష్టమైనది కావచ్చు. శాస్త్రీయంగా, మన సంక్లిష్ట మానవ శరీరం ఒక కణం నుండి పరిణామం చెందింది; ఇక్కడ ప్రతి కర్మ (మ్యుటేషన్) మునుపటి దానితో ముడిపడి ఉంటుంది. కనుక చేతిలో ఉన్న ఏ కర్మ ఒంటరిగా ఉండదు; ఎల్లప్పుడూ గత కర్మల శృంఖలాల ఫలితంగా ఉంటుంది. గత కర్మల గురించి మనము చేయగలిగినది ఏమీ లేదు.

      తదుపరి ప్రశ్న, 'చేతిలో ఉన్న పని ఎలా చేయాలి'. అహంకారాన్ని, కోరికలను వదలి పని చేయమని ఈ శ్లోకము మనకు సలహా ఇస్తుంది. అర్జునుడి విషాదము వలన వచ్చిన జ్వరము వంటి జ్వరాలను కూడా వదిలేయాలని చెబుతుంది. కోరికలు వదిలేయడం తోనే మనకు దుఃఖం నుండి విముక్తి కలిగిస్తుంది; ఎందుకంటే కోరికలు, దుఃఖం ఎల్లప్పుడూ కలిసే ఉంటాయి. 'మనకు ఎదురయ్యే అడ్డంకులను ఎలా అధిగమించాలి' అన్న ప్రశ్నకు భగవానుడైన శ్రీకృష్ణుడు అన్ని చర్యలను, బాధలను తనపై విడిచి పెట్టమని సలహా ఇచ్చారు. చేతిలో ఉన్న పని సంక్లిష్టమైనది అయినప్పుడు మనం మనకంటే అదనపు వనరులను కలిగి ఉన్నవారి నుండి సహకారం కోరుకుంటాము. ఆ సహకారం అనుభవపరంగా గాని జ్ఞానపరంగా గాని అవ్వచ్చు. మన పరిధికి మించిన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మనల్ని మనం ఆ పరమశక్తి మంతుడైన పరమాత్మునికి సమర్పించుకోవడమే ఉత్తమము. అదే మోక్షము.

      అహంకారం బలహీనతకు, భయానికి సంకేతం, దాని అస్తిత్వం కోసం సంపదలు, గుర్తింపును కోరుతుంది. ఈ అహంకారాన్ని దాటి పరమాత్మ పై సర్వస్వాన్ని విడిచిపెట్టడానికి ధైర్యం, నిర్భయత అవసరం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

1. అహంకారం తో ఆరంభం

26. గులాబీ ఎన్నడూ పద్మం కాలేదు

6. శాసన నియమాలు