82. మనం విత్తినదే కోసుకుంటాము
“ పార్థా! భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణంగా నేను వారిని అనుగ్రహింతును. మనుషులందరునూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు ” అని శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు , శక్తివంతమైన అవ్యక్తానికి , వస్తు రూపం దాల్చిన వ్యక్తానికి మధ్య సంబంధం గురించి అంతర్దృష్టిని ఇస్తున్నారు ( 4.11). మనం ఏ మార్గాన్ని అనుసరించినా , ఈ దారులు ఎంత వైరుధ్యంగా కనిపించినా అవన్నీ అవ్యక్తమైన పరమాత్మను చేరుకునే మార్గాలేనని భగవంతుడు ఇచ్చిన హామీ ఇది. రెండవది , భగవంతుడు మన భావాలు , ఆలోచనలు , చర్యలను ప్రతిబింబించే , ప్రతిధ్వనించే బహుళ పరిమితుల అద్దం ( multi dimensional mirror) లాంటివారు. మూడవది , మనం ఒక విత్తనాన్ని నాటినప్పుడు అది మొలకెత్తి ఒక చెట్టుగా పెరగడానికి సమయం పడుతుంది. ఈ సమయంలోని జాప్యం వలన మనం పరమాత్మ యొక్క ప్రతిధ్వని సూత్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతాము. మనం మన జీవితాలను షరతులు లేని ప్రేమతో నింపుకుంటే శ్రద్ధ , ప్రేమ అనివార్యంగా తిరిగివచ్చి మన జీవితాలను ఆనందమయం చేస్తాయి. మనం కోపాన్ని , భయాన్ని , ద్వేషాన్ని , క్రూరత్వాన్ని లేదా అసూయను నాటితే అవే తిరిగి వ్యాపించి మన జీవ