పోస్ట్‌లు

ఆగస్టు, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

89. స్వీయ ముక్తిని పొందడం

చిత్రం
  భగవద్గీతలో అనాసక్తి , వీత్ రాగ్ వంటి కొన్ని పదాలు భగవద్గీత యొక్క సారాంశాన్ని సూచిస్తాయి. ఆసక్తి , విరక్తి రెండు ధ్రువాలు అయితే అనాసక్తి ఈ ధ్రువాలు అధిగమిస్తుంది. అదేవిధంగా , వీత్ రాగ్ అనేది రాగం లేదా విరాగం కాదు ; రెండింటినీ అధిగమించింది. ఈ ధ్రువణాలు అహంకార వ్యక్తీకరణ తప్ప మరొకటి కాదు. ' అహం ' ఒకసారి మాయమైనప్పుడు ఆ వ్యక్తి అన్ని ధ్రువాలను అధిగమిస్తాడు. ఆ దశనే మనము ముక్తి , మోక్షము అనే పేర్లతో పిలుస్తాము. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు , “ ఆసక్తి , దేహాభిమానము మమకారము ఏమాత్రం లేనివాడును , జ్ఞానంలో స్థిరపడిన వాడును , కేవలం యజ్ఞార్ధమే కర్మలను ఆచరించువాడును అయిన మనుషుని కర్మలన్నియును పూర్తిగా విలీనమగును ” (4.23). ' అహం ' అనేది మన సంపదలు , ఆస్తులతో గుర్తింపు , స్నేహితులు - శత్రువులు ; ఇష్టాలు-అయిష్టాలు , ఆలోచనలు-భావాలతో గుర్తింపు. వాటిని వదిలివేయడం వల్ల బాధ , భయం , ఆగ్రహానికి దారితీసే తాత్కాలిక శూన్యత ఏర్పడుతుంది. కాబట్టి ' అహం ' ను వదిలివేయడం అంత తేలికైన పని కాదు. గుర్తింపదగిన విషయం ఏమిటంటే యాజమాన్యం , గుర్తింపు , కర్తృత్వం యొక్క ఆలోచనను ,

88. పాపం యొక్క కోణాలు

చిత్రం
  వికర్మ (నిషిద్ధ కర్మ) లేదా పాపం అనే ప్రశ్న చాలా జటిలమైనది. అర్జునుడు కూడా ఈ సందిగ్ధంలో ఉండి యుద్ధంలో చుట్టాలను చంపడం ద్వారా పాపం మాత్రమే కలుగుతుందని భావిస్తున్నాడు ( 1.36). వేరువేరు నాగరికతలు , సంస్కృతులు విభిన్న కర్మలను , పాపాలను నిర్వచించాయి. ఈ జాబితా కాలక్రమేణా మారుతూవచ్చింది. ఆధునిక యుగంలో దేశాలు తమవైన శిక్షాస్మృతిని కలిగి ఉంటాయి. ఇవి కొన్ని చర్యలను నేరాలు లేదా పాపాలుగా నిర్దేశిస్తాయి. ఆ పనులకు పాల్పడినప్పుడు శిక్షిస్తాయి. ఏది ఏమైనప్పటికీ అటువంటి నిషేధించిన కర్మలు మనం చేసినప్పుడు అపరాధం , పశ్చాత్తాపం , అవమాన భారంతో మనల్ని మనం శిక్షించుకుంటూ ఉంటాము. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు , “ అంతః కరణమును , శరీర ఇంద్రియములను జయించినవాడు , సమస్త భోగి సామాగ్రిని పరిత్యజించినవాడు , ఆశారహితుడు అయిన యోగి కేవలం శరీరకర్మలను ఆచరించుచు పాపములను పొందడు ( 4.21).” శ్రీకృష్ణుడు అంతకు ముందు పాపం గురించి మాట్లాడుతూ అర్జునుడితో ఇలా చెప్పారు , “ జయాపజయములను , లాభనష్టాలను , సుఖదుఃఖాలను సమానంగా భావించి , యుద్ధసన్నద్ధుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు ” (2.38). పాపాన్ని మూ

87. నిత్యతృప్తి

చిత్రం
  ఆకలితో ఉన్న నక్క పైన వేలాడుతున్న ద్రాక్ష కోసం ప్రయత్నించి , విఫలమై అందని ద్రాక్ష పుల్లగా ఉందని భావించింది. ఈ సుపరిచితమైన కథ మనము జీవితంలో అనుభవించే నిరాశ , అసంతృప్తి , ఆనందాలను అనేక కోణాలలో చూపిస్తుంది. సమకాలీన మనస్తత్వ శాస్త్రం క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడటానికి మానవ మెదడు యొక్క విధుల్లో ఒకటైన ' ఆనందాన్ని సంశ్లేషణ చేయడం ' గురించి మాట్లాడుతుంది. ద్రాక్ష పుల్లగా ఉందని తనని తాను తృప్తి పరచుకుని ముందుకు సాగుతూ నక్క కృత్రిమ ఆనందాన్ని సృష్టించుకుంది. తృప్తి గురించి వివరించేటప్పుడు శ్రీకృష్ణుడు ' సృష్టించుకున్న ఆనందాన్ని ' అధిగమించాలని ఇలా చెప్పారు , " సమస్త కర్మలయందును , వాటి ఫలితములు యందును సర్వదా ఆసక్తిని వీడి , సంసార-ఆశ్రయ రహితుడై , నిత్యతృప్తుడైన పురుషుడు , కర్మలయందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికినీ వాస్తవముగా వాటికి (కర్మలకు) కర్త కాడు ” (4.20). స్వయం తృప్తి అనేది భగవద్గీతలోని మూలోపదేశాలలో ఒకటి. చాలా సందర్భాలలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మవాన్ లేదా ఆత్మతృప్తితో ఉండమని సలహా ఇస్తారు. ఇది ఆత్మతో సంతృప్తి చెందడం తప్ప మరేదీ కాదు. ఆత్మవాన్ అనుకూల , ప్ర

86. కామం, సంకల్పం రెండింటినీ త్యజించాలి

చిత్రం
ప్రతి ఒక్క నాగరికతలోనూ సమాజ శాంతి , సహజీవనం కోసం కొన్ని పనులను చేయదగినవిగా , మరికొన్నింటిని చేయ కూడనివిగా విభజించారు. న్యాయ వ్యవస్థల అభివృద్ధితో కొన్ని చేయకూడని పనులు శిక్షార్హమైన నేరాలుగా మారాయి. న్యాయశాస్త్రం ప్రకారం ఒక నేరంలో ' ఉద్దేశం ', ' అమలు ' రెండిటి మీదా ఆధారపడి నేరనిర్ధారణ జరుగుతుంది. ' ఉద్దేశం ' అనేది నేరం చేయాలనే ఆలోచన. ఏ వ్యక్తినైనా దోషిగా నిలబెట్టడానికి రెండు భాగాల రుజువు అవసరం. ఉద్దేశాన్ని సంకల్పంగా , అమలును కామంగా గుర్తిస్తే కృష్ణుడి సూక్తిని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు , “ ఎవని కర్మలన్నియును , శాస్త్ర సమ్మతములై , కామసంకల్పవర్జితములై జరుగునో , అట్లే ఎవని కర్మలన్నియును జ్ఞానాగ్నిచే భస్మమగునో , అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని అందురు ” అని శ్రీకృష్ణుడు చెప్పారు( 4. 19). సాధారణంగా సమాజంలో ఎవరైనా నేరపూరిత ఉద్దేశ్యంతో తిరుగుతున్నప్పటికీ నేరం చేయనంత వరకు ఏ విధమైన సమస్య ఉండదు. కానీ మనం ముందుగా ఉద్దేశ్యాన్ని వదిలి వేయడంతో పాటే సంకల్పాన్ని కూడా వదులుకోవాలని శ్రీకృష్ణుడు చెప్పారు. చట్టం పట్ల భయం , ధనము మొదలైన వనరుల కొరత లేదా తమ

85. కర్మ, అకర్మ మరియు వికర్మ

చిత్రం
  ' చేసిన పనిని విస్మరించిన పని ' (Act of commission and omission) అనేది న్యాయ శబ్దావళిలో సాధారణంగా ఉపయోగించే పదబంధం. డ్రైవర్ సరైన సమయంలో బ్రేకులు వేయడంలో విఫలమవడం వల్ల అది దుర్ఘటనకు దారితీస్తుంది. ఈ ' విస్మరించటం ' లేదా అకర్మ (క్రియ చేయకపోవడం) దుర్ఘటన అనే కర్మకి దారి తీస్తుంది. ఉదాహరణకు , ఏదైనా చర్య చేస్తున్నప్పుడు మనకు అందుబాటులో ఉన్న అనేక విభిన్న సాధ్య-అసాధ్యాల నుండి మనం ఒకదాన్ని ఎంచుకుంటాము. మనం ఈ సంభావనలలో ఒకదానిని అమలు చేసినప్పుడు మిగిలిన అన్ని సంభావనలు మనకు అకర్మగా మారతాయి. ప్రతి కర్మలోనూ అకర్మ దాగి ఉంది అనే నిర్ధారణకు ఇది దారి తీస్తుంది. “ కర్మయందు అకర్మను , అకర్మలో కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. అతడు యోగి , సమస్త కర్మలు చేయువాడు ( 4.18)” అనే కృష్ణుడి క్లిష్టమైన బోధనను అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణలు మనకు సహాయపడతాయి. " కర్మ అనగానేమి అకర్మ అనగానేమి ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతం భ్రాంతికి లోనగుచున్నారు ; తికమక పడుచున్నారు ” కనుక ఈ విషయం క్లిష్టమైనది అని శ్రీకృష్ణుడు హెచ్చరిస్తున్నారు ( 4.16). " కర్మ తత్వమును త

84. పూర్వజ్ఞానుల ప్రవర్తన

చిత్రం
“ నాకు కర్మ ఫలాసక్తి లేదు. కావున కర్మలు నన్ను అంటవు. ఈ విధముగా నా తత్వమును తెలిసినవారు కర్మ బద్దులు కారు ” అని శ్రీకృష్ణుడు చెప్పారు ( 4.14). ' కర్మలపై మనకు హక్కు ఉంది కానీ కర్మఫలంపై కాదు ' అనే శ్రీకృష్ణుడి బోధనలను ( 2.47) ఇది గుర్తు చేస్తుంది. పరమాత్మగా ఆయన కూడా అదే మార్గాన్ని అనుసరిస్తారు. తాను మానవులలో వివిధ విభజనలను సృష్టించినప్పటికీ , తనకు కర్తృత్వం లేకపోవడాన్ని శ్రీకృష్ణుడు సూచించారు ( 4.13). " అర్జునా! ప్రాచీనుడైన ముముక్షువులు ఈ విధముగా నా తత్వ రహస్యమును తెలుసుకొని కర్మల నాచరించిరి. కావున నీవును ఆ పూర్వుల వలెనే నిష్కామ భావంతో కర్మల నాచరింపుము ” అని శ్రీకృష్ణుడు వివరించారు ( 4.15). మన జీవితపు సాధారణ గమనంలో కర్మఫలాన్ని పొందేందుకే మనం కర్మలు చేస్తాము. అయితే కర్మఫలాన్ని వదులుకోమని చెప్పినప్పుడు మనం కర్మలను కూడా వదులుకుంటాము. శ్రీకృష్ణుడు ఇక్కడ పరిత్యాగానికి పూర్తిగా భిన్నమైన అర్ధాన్ని మార్గాన్ని వెల్లడించారు. కర్మఫలం , కర్తృత్వం రెండింటితో అనుబంధాన్ని వదిలివేసి మనల్ని కర్మలు చేస్తూనే ఉండమని సలహా ఇచ్చారు. ఒక కర్మ మాత్రమే అయిన యుద్ధాన్ని చేయమని అర్జును

83. అసత్యం సత్యం మీదే ఆధారపడుతుంది

చిత్రం
      మనకు తెలిసిన ప్రపంచంలో సత్యం , అసత్యం రెండింటినీ చూస్తూ ఉంటాము. అసత్యము అనేది మన పరిస్థితుల వల్ల లేదా మన ఇంద్రియాలు మనస్సు యొక్క పరిమితుల వల్ల సత్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం తప్ప మరొకటి కాదని నిశిత పరిశీలన ద్వారా తెలుస్తుంది.       సుప్రసిద్ధమైన తాడు , పాము ఉదాహరణలో తాడు సత్యం , పాము సత్యమైన తాడు మీద ఆధారపడిన అసత్యం. కానీ సత్యమైన తాడును గ్రహించే వరకు మన ఆలోచనలు , చర్యలన్నీ అసత్యం పైనే ఆధారపడి ఉంటాయి. ఇటువంటి అసత్యాలు సమాజంలో తరతరాలుగా కొనసాగుతూ ఉంటాయి.       అదేవిధంగా , ఏదైనా సాంకేతికత పరిజ్ఞానాన్ని సత్యంగా పరిగణించినట్లయితే దాని దుర్వినియోగమే అసత్యం. లౌడ్ స్పీకర్ ను మంచిని ప్రచారం చేయడానికి , అమాయకులను మోసపూరితంగా హింసకు ప్రేరేపించడానికి కూడా ఉపయోగించవచ్చు. అదేవిధంగా , నేటి సోషల్ మీడియా అనేది సత్యమైతే దాన్ని దుర్వినియోగం చేసినప్పుడు అది అసత్యం అవుతుంది.       “ బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య , శూద్ర వర్ణముల వారిని , వారి గుణ కర్మలను అనుసరించి వేర్వేరుగా సృష్టించితిని. ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైననూ , శాశ్వతుడను , పరమేశ్వరుడను అయిన నన్ను , వాస్తవముగా