88. పాపం యొక్క కోణాలు
వికర్మ (నిషిద్ధ
కర్మ) లేదా పాపం అనే ప్రశ్న చాలా జటిలమైనది. అర్జునుడు కూడా ఈ సందిగ్ధంలో ఉండి
యుద్ధంలో చుట్టాలను చంపడం ద్వారా పాపం మాత్రమే కలుగుతుందని భావిస్తున్నాడు (1.36). వేరువేరు నాగరికతలు, సంస్కృతులు విభిన్న కర్మలను, పాపాలను నిర్వచించాయి. ఈ జాబితా
కాలక్రమేణా మారుతూవచ్చింది. ఆధునిక యుగంలో దేశాలు తమవైన శిక్షాస్మృతిని కలిగి
ఉంటాయి. ఇవి కొన్ని చర్యలను నేరాలు లేదా పాపాలుగా నిర్దేశిస్తాయి. ఆ పనులకు
పాల్పడినప్పుడు శిక్షిస్తాయి. ఏది ఏమైనప్పటికీ అటువంటి నిషేధించిన కర్మలు మనం
చేసినప్పుడు అపరాధం, పశ్చాత్తాపం, అవమాన భారంతో మనల్ని మనం శిక్షించుకుంటూ
ఉంటాము.
ఈ సందర్భంలో
శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు, “అంతః కరణమును, శరీర ఇంద్రియములను జయించినవాడు, సమస్త భోగి సామాగ్రిని పరిత్యజించినవాడు, ఆశారహితుడు అయిన యోగి కేవలం శరీరకర్మలను ఆచరించుచు పాపములను పొందడు (4.21).” శ్రీకృష్ణుడు అంతకు ముందు పాపం గురించి
మాట్లాడుతూ అర్జునుడితో ఇలా చెప్పారు, “జయాపజయములను, లాభనష్టాలను, సుఖదుఃఖాలను సమానంగా భావించి, యుద్ధసన్నద్ధుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు” (2.38).
పాపాన్ని
మూల్యాంకనం చేయడంలో అర్థం చేసుకోవలసిన సూక్ష్మమైన విషయం ఏమిటంటే భౌతిక ప్రపంచంలో
మనం చేసే కర్మల ఆధారంగా మనం దానిని అంచనా వేస్తాము. కానీ కృష్ణుడికి ఇది అంతర్గత
దృగ్విషయం. మనం ఏది చెబుతున్నామో, చేస్తున్నామో అనేది మన మానసిక స్థితి యొక్క పరిణామం. అందుకనే
శ్రీకృష్ణుడు మానసిక స్థాయిలో అవగాహన తెచ్చుకోమని చెబుతారు. తాత్విక స్థాయిలో ఇది
మనలో అనేక సందేహాలను లేవనెత్తుతుంది కానీ అనుభవ స్థాయిలో స్పష్టత వస్తుంది.
శ్రీకృష్ణుడు
ఇంకా ఇలా అంటారు, “ఏదైనా
కోరుకోనిది దొరికినప్పుడు, దానితో సంతుష్టి, ద్వంద్వాతీతత, అసూయ నుంచి విముక్తి, సిద్ధి-అసిద్ధి పట్ల సమానత్వం కల వ్యక్తి, కర్మలను చేసినా వాటి బంధనములలో చిక్కుకోడు”
(4.22). వాస్తవానికి, ఈ శ్లోకం భగవద్గీతలో వివిధ సందార్భాలలో ఇవ్వబడిన అన్ని బోధనలను కలిగి
ఉన్న భగవద్గీత యొక్క సూక్ష్మరూపం అని చెప్పవచ్చు.
శ్రీకృష్ణుడు
మనకు ద్వంద్వాతీత స్థితిని పొందాలని, విభజించే తత్వమున్న మనస్సును కేవలం శారీరక పోషణమునకు అవసరమైన చర్యలకు
మాత్రమే ఉపయోగించమని చెప్పారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి