89. స్వీయ ముక్తిని పొందడం
భగవద్గీతలో
అనాసక్తి, వీత్
రాగ్ వంటి కొన్ని పదాలు భగవద్గీత యొక్క సారాంశాన్ని సూచిస్తాయి. ఆసక్తి, విరక్తి రెండు ధ్రువాలు అయితే
అనాసక్తి ఈ ధ్రువాలు అధిగమిస్తుంది. అదేవిధంగా, వీత్ రాగ్ అనేది రాగం లేదా విరాగం కాదు; రెండింటినీ అధిగమించింది. ఈ ధ్రువణాలు అహంకార వ్యక్తీకరణ తప్ప మరొకటి
కాదు. 'అహం' ఒకసారి మాయమైనప్పుడు ఆ వ్యక్తి అన్ని
ధ్రువాలను అధిగమిస్తాడు. ఆ దశనే మనము ముక్తి, మోక్షము అనే పేర్లతో పిలుస్తాము.
ఈ సందర్భంలో
శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు, “ఆసక్తి, దేహాభిమానము
మమకారము ఏమాత్రం లేనివాడును, జ్ఞానంలో స్థిరపడిన వాడును, కేవలం యజ్ఞార్ధమే కర్మలను ఆచరించువాడును అయిన మనుషుని కర్మలన్నియును
పూర్తిగా విలీనమగును” (4.23). 'అహం' అనేది మన సంపదలు, ఆస్తులతో గుర్తింపు, స్నేహితులు - శత్రువులు; ఇష్టాలు-అయిష్టాలు, ఆలోచనలు-భావాలతో గుర్తింపు. వాటిని
వదిలివేయడం వల్ల బాధ, భయం, ఆగ్రహానికి దారితీసే తాత్కాలిక శూన్యత
ఏర్పడుతుంది. కాబట్టి 'అహం'ను
వదిలివేయడం అంత తేలికైన పని కాదు. గుర్తింపదగిన విషయం ఏమిటంటే యాజమాన్యం, గుర్తింపు, కర్తృత్వం యొక్క ఆలోచనను, భావాలను వదిలివేయడం అవసరం కానీ సంబంధాలు, వస్తువులు లేదా వ్యక్తులను కాదు. ఈ చక్కటి వ్యత్యాసాన్ని మనం
తెలుసుకుంటే మనకు ముక్తి లభిస్తుంది.
'నేను' అనే
పదాన్ని వదిలేసిన వ్యక్తి చేసే నిస్వార్ధ కర్మలన్నీ యజ్ఞం తప్ప మరొకటి కాదు. యజ్ఞం
అంటే అగ్నికి నైవేద్యాలు సమర్పించే అగ్నికర్మ అని సాహిత్యపరమైన అర్థం. ఇక్కడ ఇది
త్యాగం లేదా ఇచ్చిపుచ్చుకోడాన్ని తెలియచేయటానికి ఒక రూపకం వలె ఉపయోగించబడింది. మనం
అగ్నికి ఆహుతిస్తాము. అగ్ని వేడిని తిరిగి ఇస్తుంది. ఈ వేడి వంట చేయడం; నీటిని ద్రవ రూపంలో ఉంచడం; శరీర ఉష్ణోగ్రతను తగిన పాళ్లలో ఉంచడం
వంటి ప్రయోజనాల కోసం జీవితానికి అవసరం. మానవ శరీరం యొక్క నిర్వహణ ఒక యజ్ఞం
లాంటిది. ఇక్కడ ఒక అవయవం ఇస్తుంది మరొకటి తీసుకుంటుంది, అవన్నీ ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి.
అందుకే శ్రీ
కృష్ణుడు, “అర్పణ, నైవేద్యము, అగ్ని, యాజ్ఞకుడు
అన్నీ బ్రహ్మమే, నిష్కామకర్మ
అయిన యజ్ఞం ద్వారా సాధించిన ఫలితాలు కూడా బ్రహ్మమే” అని విశదీకరించారు (4.24). అహంకారాన్ని వదులుకోవడం ద్వారా పొందే ఏకత్వం ఇదే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి