94. నేర్చుకోవడం అనే కళ

జీవితాంతం అభ్యసించగల , నేర్చుకోగల సామర్థ్యం మనుషులకు మాత్రమే దక్కిన వరం. కానీ ఏమి నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి అన్నది కీలక ప్రశ్న. సత్యాన్ని గ్రహించిన జ్ఞానులకు సాష్టాంగ ప్రణామం చేయడం , ప్రశ్నించడం , సేవ చేయడం ద్వారా తత్వ జ్ఞాన ప్రాప్తి కలుగుతుందని శ్రీకృష్ణుడు ఒక మార్గాన్ని సూచించారు ( 4.34). సాష్టాంగ ప్రణామం అంటే వినమ్రత , వినయం , ఇతరుల దృక్పథాన్ని అర్ధం చేసుకోవడానికి సహనం , విశాల దృక్పథం. ఇది మనం అహంకారాన్ని అధిగమించామనడానికి సూచిక. ప్రశ్నించడం అనేది ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లోని ఫీడ్ బ్యాక్ వలయం లాంటిది ; అవగాహన వచ్చే వరకు మనం ఆలోచిస్తున్న వాటిని ; చెబుతున్నవాటిని ; చేస్తున్నవాటిని ; అన్నింటినీ ప్రశ్నిస్తూనే ఉండటం. ఆత్మసాక్షాత్కారం పొందినవారు (గురువు) ఎవరు ? వారిని కనుగొనడం ఎలా అనేది తదుపరి ప్రశ్న. శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణుడు తనకు 24 మంది గురువులు ఉన్నారని చెప్పిన జ్ఞాని యొక్క ఉదంతాన్ని వివరిస్తారు. ఆ జ్ఞాని , భూమి నుంచి క్షమను ; పసిబిడ్డ నుంచి అమాయకత్వాన్ని ; గాలి నుంచి నిస్సంగాన్ని ; తేనెటీగల నుంచి నిల్వ చేయడన్ని నిరోధించే లక్షణాన్ని ; సూర్యుడి నుంచి సమానత్వాన్ని ; చేపల