92. శ్వాస ద్వారా ఆనందం
గుండె కొట్టుకోవడం
వంటి మానవ శరీరంలోని కొన్ని కార్యకలాపాలు నిర్ణీత లయను అనుసరిస్తూ స్వయంచాలకంగా
జరుగుతాయి. కాళ్లు, చేతుల వంటి కొన్ని
అవయవ వ్యవస్థల కార్యకలాపాలను మనం నియంత్రించవచ్చు. కానీ శ్వాస అనేది
స్వయంచాలకమైనది. అలాగే దాన్ని మనం నియంత్రించగలం కనుక ప్రత్యేకమైనది.
యజ్ఞం (నిష్కామ
కర్మ), శ్వాస సందర్భంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు, “కొందరు అపానవాయువునందు ప్రాణవాయువును, మరికొందరు
ప్రాణవాయువునందు అపానవాయువునువ హవనం చేస్తారు; కొందరు ప్రాణ,
అపాన వాయుగతిని నిరోధించడం ద్వారా ప్రాణాయామంలో లీనమవుతారు”
(4.29).
శ్వాస యొక్క వ్యవధి, తీవ్రత మానసిక స్థితిని సూచిస్తాయి. ఉదాహరణకు, మనం
కోపంగా ఉన్నప్పుడు మన శ్వాస దానంతటదే వేగంగా తక్కువ తీవ్రతతో ఉంటుంది. దీని
అర్థమేమిటంటే మనం మన శ్వాసను నెమ్మదిగా, లోతుగా మార్చడం
ద్వారా మన కోపాన్ని నియంత్రించుకోవచ్చు. శ్వాసను నియంత్రించడం ద్వారా మనస్సును
నియంత్రించవచ్చని ఇది సూచిస్తుంది. ఇది ధ్యానం, ప్రాణాయామం
వంటి అనేక పద్ధతులకు దారితీసింది.
శివుడు
పార్వతికి 112 ధ్యాన పద్దతులను
వివరిస్తున్నప్పుడు, పూర్తిగా శ్వాసపై ఆధారపడిన కొన్ని
పద్ధతుల గురించి పేర్కొన్నారు. సమకాలీన ప్రపంచంలో శ్వాసను గమనించడం తదనంతరం నియంత్రించడం
ఆధారంగా మనకు అనేక ధ్యాన పద్దతులు ఉన్నాయి. ఇది ఒక సాక్షిలాగా గమనించగల కళయే.
లోపలి, వెలుపలి శ్వాసలతో ఎప్పుడూ సంచరించే మనస్సును నిమగ్నం
చేయడం ద్వారా ఈ కళను నేర్చుకోవడం సులభం. ఇది మనల్ని స్థిరం చేస్తుంది. ఈ కళను
ఆలోచనలు, భావాలను సాక్షి లాగా గమనించడానికి ఉపయోగించ వచ్చు. 'ఒక్క ఒరలో రెండు కత్తులు ఇమడవు' అన్నట్లు సాక్షి
భావం, కోరికలు ఒకదానితో ఒకటి కలిసి ఉండలేవు. చివరగా చూసేవాడు
చూడబడే వాడు కావడం అంటే త్యాగాన్నే త్యాగం చేయడం వంటిది.
ప్రాణాయామం అంటే
శ్వాస నియంత్రణ ఇది కపాలభాతి వంటి వివిధ పద్ధతుల ద్వారా సాధన చేయబడుతుంది. ప్రాణం
అంటే విత్తనాలను మొలకెత్తింపజేసే జీవశక్తి, పువ్వులని పుష్పింపజేసే శక్తి. ఇది మనలో నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ
శక్తిని సామరస్యం లేదా సంతోషకరమైన జీవనం కోసం ప్రాణాయామం క్రమబద్ధీకరిస్తుంది. ఈ
సామరస్యం లేకపోవడం ఆందోళన, భయం, ఉద్రిక్తత
తప్ప మరేమీ కాదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి